దారుణం భయ్యా : జ్యోతిష్కుడు చెప్పాడని కట్టుకున్న భార్యని కడతేర్చిన భర్త…  

Man brutally murdered wife in Anantapur, Yuvaraj, Crime news, Men killed his wife, Anantapur, Andhra pradesh,crime news,police - Telugu Anantapur, Andhra Pradesh, Crime News, Man Brutally Murdered Wife In Anantapur, Men Killed His Wife, Yuvaraj

ప్రస్తుత కాలంలో కొందరు మూఢనమ్మకాల పేరుతో చేసే పనుల కారణంగా ఇతరులు బలవుతున్నారు. తాజాగా ఓ వ్యక్తి తన భార్యని పెళ్లి చేసుకోవడం వల్ల తన జీవితంలో చెడు సంఘటనలు చోటు చేసుకుంటున్నాయని ఓ జ్యోతిష్యుడు చెప్పిన మాటలను నమ్మి ఏకంగా తన భార్యను హత్య చేసిన ఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అనంతపురం జిల్లాలో వెలుగు చూసింది.

TeluguStop.com - Man Brutally Murdered Wife In Anantapur

వివరాల్లోకి వెళితే స్థానిక జిల్లాకు చెందిన “యువరాజ్” అనే యువకుడికి ఇటీవలే అశ్విని అనే యువతితో వివాహం జరిగింది. అయితే యువరాజ్ అశ్విని ని పెళ్లి చేసుకున్న కొంతకాలానికే అనుకోకుండా ఉద్యోగాన్ని కోల్పోయాడు.

  అంతేగాక పలు ఆర్థిక పరమైన సమస్యలను కూడా ఎదుర్కుంటున్నాడు. దీంతో తన జాతకాన్ని తీసుకొని దగ్గరలో ఉన్నటువంటి ఓ జ్యోతిష్యుడు సంప్రదించాడు.

TeluguStop.com - దారుణం భయ్యా : జ్యోతిష్కుడు చెప్పాడని కట్టుకున్న భార్యని కడతేర్చిన భర్త…-General-Telugu-Telugu Tollywood Photo Image

దీంతో జ్యోతిష్కుడు తన భార్య అశ్విని ని పెళ్లి చేసుకోవడం వల్లే తనకి దురదృష్టం వెంటాడుతుందని కాబట్టి వెంటనే ఆమెని వదిలెస్తే దోషం పోతుందని సలహా ఇచ్చాడు.

దీంతో జ్యోతిష్కుడు చెప్పిన మాటలను విన్నటువంటి యువరాజ్ ఏమాత్రం ఆలోచించకుండా తన భార్య అశ్విని దారుణంగా చిత్ర హింసలు చేయడం మొదలు పెట్టాడు.

  ఈ క్రమంలో తాజాగా వీరిద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకోవడంతో విచక్షణ కోల్పోయిన యువరాజ్ తన భార్యని చేతికి అందిన కర్రతో బలంగా తల పై బాదాడు.దీంతో అశ్వినికి తీవ్ర రక్త స్రావం అయ్యి మరణించింది.

స్థానికుల నుంచి సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని దగ్గర్లో ఉన్నటువంటి  ఆసుపత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు.

అంతేగాక బాధితురాలి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల మేరకు ఫిర్యాదు నమోదు చేసుకుని యువరాజ్ ని అదుపులోకి తీసుకొని విచారించగా జ్యోతిష్కుడు ఇచ్చిన సలహా మేరకు తన భార్యను చిత్ర హింసలకు గురించేసానని అంగీకరించాడు.

 దీంతో మూఢనమ్మకాల పేరుతో సలహా ఇచ్చి నందుకు జ్యోతిష్కుడు ని కూడా పోలీసులు అరెస్టు చేసి రిమాండ్ కి తరలించారు.

#ManBrutally #Anantapur #Andhra Pradesh #Yuvaraj #MenKilled

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Man Brutally Murdered Wife In Anantapur Related Telugu News,Photos/Pics,Images..