విడ్డూరం : దొంగతనంకు వెళ్లిన వ్యక్తి అసలు విషయం మర్చిపోయి ఏం చేశాడో తెలిస్తే నవ్వు ఆపుకోలేరు  

Man Breaks Into House, Doesn\'t Steal Anything, Instead Cleans Home-cleans Home Leaves,doesn\\'t Steal Anything,good Thief,విచిత్రమైన దొంగ

చిత్ర విచిత్రమైన దొంగలను మనం ప్రపంచ వ్యాప్తంగా చూస్తూ ఉంటాం. దొంగల్లో మంచి దొంగల గురించి ఇప్పటికే మనం చాలా సార్లు చర్చించుకున్నాం. ఎంతో మంది మంచి దొంగలు తాము దోచుకున్న సొమ్మును ఇతరుల సాయం కోసం ఖర్చు చేయడం, లేదంటే దొంగతనం చేయాలనుకున్న వ్యక్తి వద్ద ఏమీ లేకపోవడంతో అతడికే సాయం చేయడం వంటి వీడియోలు, వార్తలు మనం చూశాం..

విడ్డూరం : దొంగతనంకు వెళ్లిన వ్యక్తి అసలు విషయం మర్చిపోయి ఏం చేశాడో తెలిస్తే నవ్వు ఆపుకోలేరు-Man Breaks Into House, Doesn't Steal Anything, Instead Cleans Home

ఇప్పుడు ఈ వార్త అత్యంత విచిత్రమైన వార్తగా చెప్పుకోవచ్చు. ఈ దొంగ మంచి దొంగ కాదు, చెడ్డ దొంగ కాదు. వీడు ఓ క్లీన్‌ దొంగ.

అవును వీడికి క్లీనింగ్‌ అంటే చాలా ఇష్టం, క్లీన్‌గా లేకుంటే అస్సలు దొంగతనం చేయడు.

పూర్తి వివరాల్లోకి వెళ్తే… మసూచిసెట్స్‌ లోని మార్ల్‌ బోరగ్‌లోని నేట్‌ రోమన్‌ అనే వ్యక్తి ఇల్లు ఉంది. అతడు కొన్ని రోజుల క్రితం కుటుంబ సభ్యులతో కలిసి ఊరు వెళ్లాడు. అతడు ఇంటికి తాళం వేసి వెళ్లి పోవడంను ఒక దొంగ గమనించి ఉన్నట్లున్నాడు.

దొంగ ఒక రాత్రి సమయంలో ఇంట్లోకి దూరాడు. కిటికి అద్దం పగుల కొట్టి, మెల్లగా ఇంట్లోకి దూకేసిన వ్యక్తి ఆ ఇంట్లో పరిస్థితి చూసి అవాక్కయ్యాడు. ఊరు వెళ్తున్న గందరగోళంలోనో లేక మరేంటో కాని ఇల్లంతా గందరగోళంగా చేసి వెళ్లారు.

ఆ దొంగతకు ఇల్లు అలా ఉండటం నచ్చలేదు.

వెంటనే తాను వచ్చిన పని పక్కకు పెట్టి దాదాపుగా గంటన్నర పాటు ఒక్క కిచెన్‌ తప్ప మిగిలిన రూంలు అన్ని కూడా నీట్‌గా సర్దేశాడు. అన్ని వస్తువులు చాలా నీట్‌గా కప్‌బోర్డ్‌లో, ఎక్కడి వస్తువులు అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అంతా నీట్‌గా చేసి అక్కడ ఖరీదైన వస్తువులు ఏం దొరకక పోవడంతో అక్కడ నుండి వెళ్లి పోయాడు.

మరుసటి రెండు రోజుల తర్వాత వచ్చిన రోమన్‌ కుటుంబ సభ్యులు ఇంటిని చూసి అవాక్కయ్యారు. ఇల్లు అంతా నీట్‌గా ఉంది..

అసలేం జరిగిందని సీసీ టీవీ ఫుటేజ్‌ చూస్తే మొహానికి మాస్క్‌ వేసుకున్న ఒక వ్యక్తి ఇంటిని అంతా కూడా నీట్‌గా సర్దనం కనిపించింది. అతడు దొంగ అని, ఇల్లు నీట్‌గా లేకపోవడంతో నీట్‌గా సర్దేసి వెళ్లి పోయాడని తెలుస్తోంది.

అతడిపై రోమన్‌ పోలీసులకు అయితే ఫిర్యాదు చేయలేదు కాని, ఆ వీడియోను సోషల్‌ మీడియా ద్వారా పోస్ట్‌ చేశాడు. దాంతో ఆ నీట్‌ దొంగ గురించి వైరల్‌ అయ్యింది.