క్రికెటర్ భార్యని వేధిస్తున్న ఆకతాయిలు అరెస్ట్..   

ఈ మధ్య కాలంలో సోషల్ మీడియా మధ్యమాలు అందరికీ అందుబాటులోకి రావడంతో సెలబ్రిటీలకు మరియు సామాన్య ప్రజలకు మధ్య దూరం బాగా తగ్గిపోయింది.దీంతో కొందరు ఆకతాయిలు సెలబ్రిటీలకు పై అనుచిత వ్యాఖ్యలు చేచేస్తూ వారి పరువు ప్రతిష్టలకు భంగం కలిగించే చర్యలకు పాల్పడుతున్నారు.

TeluguStop.com -  Man Arrested For Threatening Mohammed Shami Estranged Wife Hasin Jahan

కాగా తాజాగా ఓ ప్రముఖ క్రికెటర్ భార్య ని అత్యాచారం చేసి చంపేస్తామంటూ ఇద్దరు ఆకతాయిలు బెదిరించగా ఇటీవలే పోలీసులు అరెస్టు చేశారు.

పూర్తి వివరాల్లోకి వెళితే భారత జట్టు ప్రముఖ పేస్ బౌలర్ మహమ్మద్ షమీ ఇటీవలే తన భార్య హసీనా జహాన్ తో పలు గొడవల కారణంగా వేరుగా ఉంటున్న సంగతి అందరికీ తెలిసిందే.

TeluguStop.com - క్రికెటర్ భార్యని వేధిస్తున్న ఆకతాయిలు అరెస్ట్.. -Latest News - Telugu-Telugu Tollywood Photo Image

ఈ క్రమంలో హసీనా జహాన్ పశ్చిమ బెంగాల్ లోని కోల్కతా పట్టణ పరిసర ప్రాంతంలో నివాసముంటోంది.  కాగా ఈమె గత కొద్ది కాలంగా సినిమా అవకాశాల కోసం బాగానే ప్రయత్నిస్తోంది.

 ఈ క్రమంలో పలు ఫోటో షూట్ సంస్థలు నిర్వహిస్తున్న ఫొటోషూట్ కార్యక్రమాలలో పాల్గొంటూ అందమైన ఫోటోలను సోషల్ మీడియా మాధ్యమాలలో షేర్ చేస్తోంది.

దీంతో ఈ విషయం నచ్చనటువంటి కొందరు మహమ్మద్ షమీ అభిమానులు ఆమెపై దారుణంగా కామెంట్స్ చేస్తూ అసభ్య పదజాలంతో దూషిస్తున్నారు.

అంతేగాక సినిమాల్లో నటించాలనే నెపంతో బోల్డ్ గా ఉన్నటువంటి ఫోటోలను నెట్లో షేర్ చేస్తే అత్యాచారం చేసి హతమారుస్తామని బెదిరిస్తున్నారు. దీంతో భయాందోళనలకి గురైన హసీనా జహాన్ వెంటనే దగ్గర్లో ఉన్న పోలీసులను సంప్రదించి తనపై బెదిరింపులకు పాల్పడుతున్న వ్యక్తులను అరెస్టు చేయాలంటూ ఫిర్యాదు చేసింది.

బాధితురాలు తెలిపిన వివరాల మేరకు దర్యాప్తు చేపట్టిన పోలీసులు సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా ఆమెను వేధిస్తున్న ఆకతాయిలపై నిఘా ఉంచారు. ఈక్రమంలో ఇటీవలే ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు.కానీ వారి పేరును మాత్రం వెల్లడించ లేదు.

#MahammadShami #Kolkata Police #ManArrested #Cricketer #Hasin Jahan

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Man Arrested For Threatening Mohammed Shami Estranged Wife Hasin Jahan Related Telugu News,Photos/Pics,Images..