కెనడాలో సెటిలవ్వాలని..సినీ ఫక్కీలో కుట్ర: ఎయిర్‌పోర్ట్‌లోనే దొరికిపోయిన యువకుడు  

Man Impersonates Student To Fly To Canada For "Better Life", Arrested in delhi airport, Delhi Airport, Canada,Better Life, student documents - Telugu Arrested In Delhi Airport, Better Life, Canada, Delhi Airport, Man Impersonates Student To Fly To Canada For \"better Life\", Student Documents

విదేశాలకు వెళ్లి మంచి ఉద్యోగం సంపాదించి జీవితంలో బాగా స్థిరపడాలనేది లక్షలాది మంది భారతీయ యువత కల.చిన్నప్పటి నుంచే ఇందుకోసం ప్రణాళికలు రూపొందించుకుంటూ వస్తారు.

TeluguStop.com - Man Arrested Delhi Airport Student Documents

కానీ పెరుగుతున్న పోటీ, వివిధ దేశాల్లో ఉన్న ఆంక్షల కారణంగా ప్రస్తుత రోజుల్లో ఫారిన్ కల నెరవేరడం కష్టంగా మారింది.చట్టబద్ధంగా వీలు కానీ పక్షంలో అక్రమంగానైనా అనుకున్నది సాధించాలని కొందరు భావిస్తున్నారు.

ఇలా ప్లాన్ చేసిన ఓ విద్యార్ధి పోలీసులకు అడ్డంగా దొరికిపోయాడు.
ఉత్తరప్రదేశ్‌లోని రామ్‌పూర్ జిల్లా రావణ ఘాసి గ్రామానికి చెందిన మెహతాబ్ సింగ్‌కు చిన్నప్పటి నుంచి కెనడా వెళ్లాలని కోరిక.

TeluguStop.com - కెనడాలో సెటిలవ్వాలని..సినీ ఫక్కీలో కుట్ర: ఎయిర్‌పోర్ట్‌లోనే దొరికిపోయిన యువకుడు-Latest News - Telugu-Telugu Tollywood Photo Image

దీనిలో భాగంగా అతను మరో విద్యార్ధికి సంబంధించిన పాస్‌పోర్ట్, వీసాలను ఉపయోగించాడు.కెనడాలోని టొరంటోకు బయల్దేరాలని నిర్ణయించుకున్న అతను తన పథకంలో భాగంగా సెప్టెంబర్ 17 రాత్రి న్యూఢిల్లీలోని ఇందిరాగాంధీ విమానాశ్రయానికి చేరుకున్నాడు.

అయితే మెహతాబ్ సింగ్ ప్రవర్తనపై ఎయిర్‌పోర్ట్ సిబ్బందికి అనుమానం వచ్చింది.దీంతో అధికారులు రెండోసారి అతని ధ్రువపత్రాలను తనిఖీ చేయగా అవి ఆదిత్య సింగ్ అనే విద్యార్ధివని తేలింది.

దీంతో అతనిని పోలీసులకు అప్పగించారు.

ఎలాగైనా కెనడా వెళ్లాలనే ఉద్దేశ్యంతోనే తాను మరో విద్యార్ధి ధ్రువపత్రాలు ఉపయోగించానని మెహతాబ్ నేరాన్ని అంగీకరించాడు.

ఇందుకు గాను ఉత్తరాఖండ్‌కు చెందిన బల్వంత్ సింగ్ అనే ఓ ఏజెంట్ తనకు సహకరించినట్లు వెల్లడించాడు.కెనడాకు క్షేమంగా చేరుకున్న తర్వాత బల్వంత్‌సింగ్‌కు రూ.20 లక్షలు ఇచ్చేందుకు తమ మధ్య ఒప్పందం కుదిరినట్లు మెహతాబ్ వెల్లడించాడు.ఈ నేపథ్యంలో బల్వంత్ సింగ్ కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.

.

#ManImpersonates #Canada #Better Life #Delhi Airport #ArrestedIn

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Man Arrested Delhi Airport Student Documents Related Telugu News,Photos/Pics,Images..