విడాకులు తీసుకున్న మహిళతో సహజీవనం.. చివరికి..?

పెళ్లి చేసుకుంటానని చెప్పి నమ్మించి ఒక వివాహితను మోసం చేసి పరారయిన ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది.యువకుడిని హైదరాబాద్ బహదూర్ ‌పురా పోలీసులు అరెస్ట్ చేశారు.

 Man Arrested Cheating Woman, Matrimony Website, Cheating Woman,hyderabad-TeluguStop.com

ఇందుకు సంబంధించిన అసలు వివరాలలోకి వెళితే… కిషన్‌బాగ్‌ ప్రాంతానికి చెందిన ఓ మహిళ కొంతకాలం క్రితం భర్తతో ఏవో గొడవలు అయి విడాకులు తీసుకుంది.ఎదో పనులు చేసుకుని కాలం గడుపుతుంది.

అయితే రెండో వివాహం చేసుకోవాలనే ఉద్దేశంతో ఇటీవలే తన వివరాలను ఓ మ్యాట్రిమోనీ వెబ్ ‌సైట్ ‌లో అప్‌లోడ్ చేసింది.

ఆ వివరాలు చూసిన యాసరుల్లా(25) అనే యువకుడు ఆమెకు ఫోన్‌ చేసి ఆమెతో పరిచయం పెంచుకున్నాడు.

ఆ పరిచయం కాస్త ప్రేమ దాక దారితీసింది.అతడు నచ్చడంతో పెళ్లి చేసుకోవాలని నిర్ణయం తీసుకుంది.

పెళ్లి చేసుకుందాం అని యాసరుల్లాని అడగగా తాను పెళ్లి చేసుకోవడానికి కొంత సమయం పడుతుందని, అందువల్ల కొంతకాలం సహజీవనం చేద్దామని యాసరుల్లా చెప్పడంతో ఆమె సరేనంది.దీన్ని అవకాశంగా తీసుకున్న అతడు ఆమెపై అనేకసార్లు లైంగిక దాడికి పాల్పడ్డాడు.

తన మోజు తీర్చుకున్నాడు.

ఆమెకి అనుమానం వచ్చి పెళ్లి చేసుకుందాం అని అడిగింది.

దానితో అతడు ఆమెకు మొహం చాటేశాడు.అలాగే కొన్నాళ్ల పాటు అసలు కనపడలేదు.

అంతేకాకుండా అతడి ఫోన్ కూడా స్విచ్ఛాఫ్ రావడంతో మోసపోయానని గ్రహించిన బాధితురాలు బహదూర్‌ పురా పోలీసులకు ఫిర్యాదు చేసింది.దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేసి నిందితుడిని శుక్రవారం అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube