అమెరికాలో భారత సంతతి సిక్కు ట్యాక్సీ డ్రైవర్‌పై దాడి... ఎట్టకేలకు నిందితుడు అరెస్ట్

అమెరికాలోని జాన్ ఎఫ్ కెనడీ అంతర్జాతీయ విమానాశ్రయం వద్ద భారత సంతతి సిక్కు ట్యాక్సీ డ్రైవర్‌పై దాడి ఘటన పెను దుమారం రేపిన సంగతి తెలిసిందే.అమెరికాలోని సిక్కు కమ్యూనిటీతో పాటు భారత ప్రభుత్వం సైతం ఈ ఘటనను తీవ్రంగా పరిగణించింది.

 Man Arrested, Charged With Hate Crime For Attacking Indian-origin Sikh Taxi Driv-TeluguStop.com

తక్షణం ఈ ఘటనపై విచారణ జరపాల్సిందిగా అమెరికాలోని ఇండియన్ ఎంబసీ.ఆ దేశ ప్రభుత్వాన్ని కోరింది.

దీంతో రంగంలోకి దిగిన దర్యాప్తు బృందాలు ఎట్టకేలకు నిందితుడిని అదుపులోకి తీసుకున్నాయి.అతనిపై ఉద్వేషపూరిత నేరం కింద అభియోగాలు మోపారు.

నిందితుడిని మొహమ్మద్ హస్సనైన్‌గా గుర్తించారు.అయితే గోప్యత కోసం బాధితుడి పేరును మిస్టర్ సింగ్‌గా తెలిపారు.

ఈ అరెస్ట్‌కు సంబంధించి న్యూయార్క్ పోర్ట్ అథారిటీ, న్యూజెర్సీ పోలీస్ డిపార్ట్‌మెంట్ (పీఏపీడీ)లు ధ్రువీకరించాయి.ఈ సంఘటనను ద్వేషపూరిత నేరంగా పరిగణిస్తున్నామని .బాధితుడిని నిందితుడు మొహమ్మద్ ‘‘బ్యాక్ టు యువర్ కంట్రీ’’ అని బెదిరించాడని పోలీసులు ఛార్జ్‌షీటులో పేర్కొన్నారు.సింగ్‌ను తీవ్రంగా కొడుతూ… పక్కకు తోసేస్తూ ‘‘తలపాగా వేసుకున్న వ్యక్తులు’’ అంటూ అసభ్య పదజాలంతో దూషించాడని తెలిపారు.

ఈ కేసుకు సంబంధించి త్వరలో అతనిపై విచారణ జరగనుంది.దీనిపై సిక్కు కమ్యూనిటీ హర్షం వ్యక్తం చేసింది.ఈ విపత్కర పరిస్ధితుల్లో తమకు అండగా నిలిచిన దర్యాప్తు బృందాలకు, అమెరికా అధికార యంత్రాంగానికి కృతజ్ఞతలు తెలిపింది.

కాగా.అమెరికాలోని జాన్ ఎఫ్ కెనడీ అంతర్జాతీయ విమానాశ్రయం వద్ద భారత సంతతి సిక్కు ట్యాక్సీ డ్రైవర్‌పై నిందితుడు ఈ దాడికి తెగబడ్డాడు.ఈ ఘటనలో నిందితుడు.సిక్కు వ్యక్తి తలపాగాను లాగి కిందపడేశాడు.ఆలస్యంగా వెలుగు చూసిన ఈ ఘటన ఎప్పుడు జరిగిందో తెలియరాలేదు.అయితే జనవరి 4న ఓ వీడియోను నవజ్యోత్ పాల్ కౌర్‌ అనే మహిళ ట్విట్టర్‌లో షేర్ చేయడంతో వైరల్ అవుతోంది.

ఇందులో బాధితుడిని పదే పదే కొట్టడం, అసభ్య పదజాలంతో దూషించడంతో పాటు తలపాగాను లాగడం కనిపిస్తోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube