కెనడా: తిరంగ ర్యాలీపై ఖలిస్తానీల దాడి.. భారత్ సీరియస్, రంగంలోకి పోలీసులు

భారత ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలను నిరసిస్తూ రైతులు దాదాపు మూడు నెలలుగా ఆందోళన నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.అన్నదాతలకు మనదేశంతో పాటు అంతర్జాతీయంగానూ మద్ధతు లభిస్తోంది.

 Man Arrested Charged Over Violence During Tiranga Maple Rally In Canada-TeluguStop.com

అయితే రిపబ్లిక్ డే రోజున రైతులు నిర్వహించిన ట్రాక్టర్ ర్యాలీ తర్వాతి నుంచి పరిస్థితులు మారిపోయాయి.రైతుల ఆందోళన ముసుగులో ఖలీస్తానీ వేర్పాటు వాదులు దేశ విచ్ఛిన్నానికి ప్రయత్నిస్తున్నారంటూ నిఘా వర్గాలు సంచలన నివేదికను బయటపెట్టాయి.

దీనికి తోడు రైతులకు మద్ధతుగా ప్రముఖ పర్యావరణ కార్యకర్త గ్రేటా థన్‌బర్గ్ ట్వీట్ చేసిన ‘‘టూల్ కిట్ ’’ వ్యవహారం ఇప్పుడు రాజకీయాలను హాట్ హాట్‌గా మారుస్తోంది.ఈ ఘటనకు సంబంధించి దిశా రవి సహా పలువురిని పోలీసులు అరెస్ట్ చేశారు.

 Man Arrested Charged Over Violence During Tiranga Maple Rally In Canada-కెనడా: తిరంగ ర్యాలీపై ఖలిస్తానీల దాడి.. భారత్ సీరియస్, రంగంలోకి పోలీసులు-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

రైతుల ఆందోళనకు మద్ధతుగా కెనడా, అమెరికాలలో కొందరు ఖలీస్తానీ వేర్పాటు వాదులు ధర్నాలు, నిరసనలకు దిగుతున్నారు.అయితే వారికి పోటీగా కెనడాలోని కొందరు ప్రవాసులు భారతదేశ ఐక్యత కోసం ర్యాలీలు నిర్వహిస్తున్నారు.

ఇది కొందరు ఖలిస్తానీయులకు కంటగింపుగా మారింది.దీంతో మీపై అత్యాచారంతో పాటు హింసాత్మక చర్యలకు పాల్పడతామని, వ్యాపారాలను దెబ్బతీస్తామంటూ కెనడాలోని భారతీయ విద్యార్థులు, ఉద్యోగులు, వ్యాపారులను కొందరు ఆగంతకులు బెదిరిస్తున్నారు.

ఈ నేపథ్యంలో కోవిడ్‌‌తో అల్లాడుతున్న కెనడాకు భారతదేశం వ్యాక్సిన్ డోసులను అందించేందుకు ముందుకు వచ్చింది.దీనిపై హర్షం వ్యక్తం చేసిన ఓ ఇండో కెనడియన్ గ్రూప్ కోవిడ్ వ్యాక్సిన్ల రాకను పురస్కరించుకుని టోరంటోలో భారీ కార్ల ర్యాలీ నిర్వహించింది.

భారత్ , కెనడా జాతీయ పతకాలను చేతబూనీ వీరు ర్యాలీ నిర్వహించారు.అయితే దీనిని ఖలిస్తానీలు అడ్డుకుని వారితో వాగ్వాదానికి దిగడంతో పాటు దాడులకు పాల్పడ్డారు.వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా భారత ప్రభుత్వానికి అనుకూలంగా వీరు మద్ధతు పలకడంతోనే ఖలిస్తానీలు దాడికి దిగారని నివేదికలు చెబుతున్నాయి.ఈ ఘటనపై ఇప్పటి వరకు 15 ఫిర్యాదులు అందినట్లు పోలీసులు తెలిపారు.

దీనిపై రంగంలోకి దిగిన పోలీసులు నాటి విధ్వంసానికి సంబంధించి ఓ 27 ఏళ్ల యువకుడిని అదుపులోకి తీసుకున్నారు.ఇతనిని గ్రేటర్ టొరంటోలోని బ్రాంప్టన్‌కు చెందిన వ్యక్తిగా గుర్తించారు.

Telugu America, Canada, Greta Thunberg, India-Telugu NRI

మరోవైపు తిరంగా ర్యాలీ సందర్భంగా భారతీయులపై దాడిని భారత ప్రభుత్వం తీవ్రంగా పరిగణించింది.కెనడాలోని భారత హైకమీషన్ ఆ దేశ విదేశాంగ మంత్రిత్వ శాఖకు దీనిపై ఫిర్యాదు చేసింది.ఈ దాడికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ.భారతీయులను మరింత ఆందోళనకు గురిచేస్తున్నాయని హైకమీషన్ తెలిపింది.కాగా, భారత్ నుంచి ఐదు లక్షల కొవిడ్-19 వ్యాక్సిన్ డోస్‌లు గురువారం కెనడాకు చేరుకున్నాయి.‘ఆస్ట్రాజెనెకా, కొవిషీల్డ్ వ్యాక్సిన్లను సీరమ్ కెనడాకు పంపగా, మరో 15 లక్షల వ్యాక్సిన్ డోస్‌లు త్వరలో రానున్నాయి.

తమకు వ్యాక్సిన్ డోస్‌లను పంపాలంటూ కొద్ది రోజుల క్రితం కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో భారత ప్రధాని మోదీని కోరారు.కెనడాకు వ్యాక్సిన్ డోస్‌లను పంపేందుకు తమ వంతు కృషి చేస్తామని మోదీ హామీ ఇచ్చారు.

కెనడాకు ఇచ్చిన హామీ ప్రకారం ‘వ్యాక్సిన్ మైత్రి’ కింద భారత ప్రభుత్వం తాజాగా ఐదు లక్షల వ్యాక్సిన్ డోస్‌లను పంపింది.

#India #Greta Thunberg #Canada #America

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు