దెయ్యం వదిలిస్తానంటూ బాలికలపై దారుణంగా?  

man arrest because of physical harassment on girls, man arrested,harassment,witch,Salem District,girls - Telugu Girls, Harassment, Man Arrested, Salem District, Witch

కాలం మారుతూ ఎంతో అభివృద్ధి చెందుతున్నప్పటికీ, కొందరు మాత్రం మూఢనమ్మకాలను ఎక్కువగా విశ్వసిస్తుంటారు.ఎటువంటి సమస్యలు తలెత్తినా దొంగ బాబాల దగ్గరికి, మంత్రగాళ్ళ దగ్గరకు వెళ్లి మోసపోతుంటారు.

TeluguStop.com - Man Arrest Because Of Physical Harassment On Girls

ఇలాంటి తరహాలోనే తన కూతుళ్లకు దయ్యం పట్టిందని వాటిని వదిలిస్తానని చెప్పి వారిపై అత్యాచారానికి పాల్పడిన ఘటన సేలం జిల్లాలో చోటు చేసుకుంది.పోలీసులు తెలిపిన వివరాల మేరకు…

సేలం జిల్లాకు చెందిన ఓ వ్యక్తి ఒక రైతు తోటలో పని చేసుకుంటూ అక్కడే తన భార్య పిల్లలతో నివసిస్తుండేవాడు.తనకు15,13 సంవత్సరాల వయసు కలిగిన ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.ప్రస్తుతం కరోనా సమయంలో స్కూల్ తెరవకపోవడంతో ఇద్దరు ఇంటి దగ్గరే ఉంటున్నారు.

TeluguStop.com - దెయ్యం వదిలిస్తానంటూ బాలికలపై దారుణంగా-Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image

అయితే గత కొద్ది రోజుల నుంచి వీరిద్దరి ప్రవర్తనలో మార్పు రావడంతో వారిని నామక్కల్‌ జిల్లాకు చెందిన శేఖర్‌ (50) అనే మంత్రగాడి వద్దకు గత నెలలో తీసుకెళ్లారు.

ఆ మంత్ర గాడు వీరిద్దరికీ దయ్యం పట్టిందని ప్రతి శుక్రవారం కొన్ని ప్రత్యేకమైన పూజలు చేసి దయ్యం వదిలిస్తానని చెప్పి, ఆ బాలిక ఇద్దరిని తన వద్దే ఉంచి వెళ్లాలని వారి తల్లిదండ్రులతో చెప్పారు.

అతని మాట నమ్మిన తల్లిదండ్రులు తన కూతుర్లను అతని దగ్గర వదిలి వెళ్లారు.అయితే మంత్రగాడు వీరి పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తూ పలుమార్లు వారిపై అత్యాచారానికి పాల్పడ్డాడు.

ఈ విషయమై తమ తల్లిదండ్రులతో చెప్పడానికి భయపడిన వారు ఆ మంత్రగాడు వేధింపులు అధికం కావడంతో వాటిని భరించలేక జరిగిన విషయం మొత్తం తన తల్లిదండ్రులకు తెలిపారు.ఈ విషయమై ఆ తల్లిదండ్రులు అతనిపై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో, అతను నకిలీ మంత్రగాడు అని తేలడంతో, పోలీసులు శేఖర్ ను అదుపులోకి తీసుకుని పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి అతనిని జైలుకు తరలించారు.

#Man Arrested #Witch #Girls #Salem District #Harassment

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Man Arrest Because Of Physical Harassment On Girls Related Telugu News,Photos/Pics,Images..