దారుణం : లాక్ డౌన్ కారణంగా ఆర్థిక పరిస్థితి బాగలేదని ఏకంగా కన్న కూతురినే....

ఆకలి మనుషులను ఎంతటి ఘాతుకానికి అయినా పాల్పడేలా చేస్తుందని పలు సందర్భాల్లో మనం వినే ఉంటాం.అయితే తాజాగా ఓ వ్యక్తి ప్రస్తుతం లాక్ డౌన్ కారణంగా తన కుటుంబ పోషణ భారమై ముక్కుపచ్చలారని చిన్నారి కూతురుని దారుణంగా గొంతు కోసి హత్య చేసిన ఘటన తెలంగాణ రాష్ట్రంలోని సంగారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది.

 Man 4 Year Old Daughter For Poverty In Sangareddy District-TeluguStop.com

ఈ ఘటనతో ఒక్కసారిగా జిల్లా మొత్తం ఉలిక్కిపడింది.

వివరాల్లోకి వెళితే స్థానిక జిల్లాకు చెందిన పుల్కల్ మండలంలోని ఓ గ్రామంలో జీవన్ అనే వ్యక్తి తన కుటుంబ సభ్యులతో నివాసం ఉంటున్నాడు.

 Man 4 Year Old Daughter For Poverty In Sangareddy District-దారుణం : లాక్ డౌన్ కారణంగా ఆర్థిక పరిస్థితి బాగలేదని ఏకంగా కన్న కూతురినే….-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అయితే ఇతడు కుటుంబ పోషణ నిమిత్తమై గ్రామంలో చిన్న చిన్న పనులు చేసుకుంటూ కుటుంబాన్ని నెట్టుకొస్తున్నాడు.గత కొద్దికాలంగా కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు ప్రభుత్వం లాక్ డౌన్ విధించడంతో పనులు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నాడు.

దీంతో పరిస్థితులు ఇలాగే కొనసాగితే తన కుటుంబ పోషణ భారం అవుతుందని ఆలోచించిన జీవన్ తన ముక్కు పచ్చలారని 4 ఏళ్ళు కలిగిన కూతురిని దారుణంగా హత్య చేశాడు.

ఈ విషయం గమనించినటువంటి స్థానికులు వెంటనే దగ్గరలో ఉన్నటువంటి పోలీసులకు సమాచారం అందించారు.

సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించి చిన్నారి మృతదేహాన్ని పంచనామా నిమిత్తమై దగ్గర్లోని ఆసుపత్రికి తరలించారు.మృతురాలి కుటుంబ సభ్యులు తెలిపినటువంటి వివరాల మేరకు ఫిర్యాదు నమోదు చేసుకొని నిందితుడిని విచారణ నిమిత్తమై జైలుకు తరలించారు.

#Telangana #4Year

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు