బెంగాల్ దిశగా వెళుతున్న ఫణి తుఫాన్.... రద్దు అయిన దీదీ ర్యాలీ లు

గత రెండు రోజులుగా కురుస్తున్న ఫణి తుఫాన్ పెను భీభత్సాన్ని సృష్టిస్తున్న సంగతి తెలిసిందే.ఈ ఫణి తుఫాన్ ప్రభావం తో ఒడిశా అతలాకుతలం అయ్యింది.

 Mamta Rallies Have Been Cancelled By Phani Tuffan-TeluguStop.com

మరోపక్క శ్రీకాకుళం జిల్లా లో కూడా ఈ ఫణి తుఫాన్ ప్రభావం ఎక్కువగానే ఉంది.అయితే ఈ ఫణి తుఫాన్ కారణంగా పశ్చిమ బెంగాల్ సీ ఎం మమతా బెనర్జీ తన ఎన్నికల ర్యాలీ లను రద్దు చేసుకున్నట్లు తెలుస్తుంది.

ఒడిశా లో ఎంటర్ అయిన ఫణి తుఫాన్ బెంగాల్ దిశగా వెళ్లనుంది.ఈ క్రమంలో ఆ రాష్త్ర సి ఎం మమతా బెనర్జీ అప్రమత్తమై అక్కడ తుఫాన్ పరిస్థితులను పరిశీలించనున్నారు ఈ క్రమంలో ఆమె తన ఎన్నికల ర్యాలీ కార్యక్రమాలను రద్దు చేసుకున్నట్లు సమాచారం.

ఈ రోజు,రేపు ఆమె నిర్వహించాల్సిన ర్యాలీలను దీదీ రద్దు చేసినట్లు తెలుస్తుంది.మరో పక్క ఈ ఫణి తుఫాన్ ప్రభావం కారణంగా పలు రైళ్లు కూడా రద్దు అయ్యాయి.

దీనితో కోల్ కతా రైల్వే స్టేషన్ లో వందల సంఖ్యలో ప్రయాణికులు పడిగాపులు పడుతున్నారు.ఈ తుఫాన్ ప్రభావానికి కోల్ కతా విమానాశ్రయం కూడా మూసివేసినట్లు తెలుస్తుంది.

ఈ క్రమంలో ఈ రోజు మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 8:30 నిమిషాల వరకు కూడా అన్నీ దేశీయ,అంతర్జాతీయ విమానాలను అన్నిటిని రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు.

గత రెండు రోజులుగా కురుస్తున్న ఈ ఫణి తుఫాన్ ప్రభావానికి శ్రీకాకుళం,విజయనగరం జిల్లా లు దెబ్బ తిన్నాయి.

మరోపక్క విజయవాడ-విశాఖ పట్నం- భువనేశ్వర్ మధ్య నడిచే రైళ్ల లో కొన్నింటిని రద్దు చేయగా,మరికొన్నింటిని దారి మళ్లించినట్లు తెలుస్తుంది.సికింద్రాబాద్, విజయవాడ డివిజన్ కార్యాలయాల్లో ఎమర్జెన్సీ కంట్రోల్ రూమ్లను ప్రారంభించిన అధికారులు.

హెల్ప్ లైన్ లను కూడా అందుబాటులో ఉంచారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube