నిర్మాతగా మారుతున్న ఎన్ఠీఆర్ హీరోయిన్

ఈ మధ్య కాలంలో హీరోయిన్స్ కూడా ఓ వైపు నటిగా కొనసాగుతూనే మరో వైపు నిర్మాణ రంగంలోకి అడుగు పెడుతున్నారు.గతంలో కూడా సావిత్రి లాంటి మహానటి కూడా దర్శకురాలిగా, నిర్మాతగా మారి చేతులు కాల్చుకుంది.

 Mamta Mohandas Turns Producer, Tollywood, Kollywood, Yamadonga Movie, Malayalam-TeluguStop.com

అయితే ప్రస్తుతం హీరోయిన్స్ కి ప్లానింగ్ ఉండటం నిర్మాతగా అడుగుపెట్టిన తర్వాత కూడా సక్సెస్ ఫుల్ గా తమ జర్నీ సాగిస్తున్నారు.తెలుగులో స్టార్ హీరోయిన్ అయిన ఛార్మి పూరి జగన్నాథ్ దయవల్ల నిర్మాతగా మారి మంచి డబ్బులు సంపాదిస్తుంది.

సమంత కూడా నిర్మాతగా సొంత ప్రొడక్షన్ హౌస్ స్టార్ట్ చేసేందుకు రెడీ అవుతుంది.అలాగే ఇప్పుడు మరో హీరోయిన్ కూడా నిర్మాతగా తొలి అడుగులు వేయడానికి రెడీ అయ్యింది.

తెలుగులో రాఖీ, యమదొంగ, కింగ్‌ సినిమాల్లో హీరోయిన్‌గా నటించిన మమతా మోహన్‌దాస్ గురించిప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.‌
ఆమె నటిగా సౌత్ లో అన్ని భాషలలో నటించింది.

అలాగే గాయనిగా కూడా తన టాలెంట్ చూపించుకుంది.తెలుగులో రాఖీ రాఖీ సాంగ్ ని ఈమె పాడింది.

ఆ మధ్య క్యాన్సర్ బారిన పడి కోలుకున్న మమతా మోహన్ దాస్ ప్రస్తుతం తన మాతృబాష మలయాళంలో వరుసగా సినిమాలు చేస్తుంది.తాజాగా ఈమె నిర్మాతగా మారారు.

మమతా మోహన్‌దాస్‌ ప్రొడక్షన్స్‌ అనే నిర్మాణ సంస్థను ప్రారంభించారామె.ఈ విషయం గురించి మమతా మోహన్‌దాస్‌ మాట్లాడుతూ నిర్మాణంలోకి అడుగుపెడుతున్నందుకు ఆనందంగా ఉంది.

కల నిజం అవుతున్నట్టుంది.ఈ ప్రయాణంలో నాకు తోడుగా ఉన్న అందరికీ ధన్యవాదాలు.

నన్ను ఇంత ఆదరించిన ఇండస్ట్రీకి తిరిగి ఇవ్వాలనే ఆలోచన నుంచే ఈ నిర్మాణ సంస్థను స్థాపించాను అన్నారు.తొలి ప్రయత్నంగా ఒక లేడీ ఓరియంటెడ్‌ సినిమా తెరకెక్కించనున్నారని తెలుస్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube