మమతా బెనర్జీ ఆస్తుల వివరాలు..!!

తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఎన్నికల ప్రచారంలో హోరెత్తిస్తున్న సంగతి తెలిసిందే.త్వరలో పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఎన్నికల ప్రచారంలో బిజీగా గడుపుతున్న ఆమెకు ఇటీవల కాలికి గాయం కావడంతో పార్టీ కేడర్ ఒక్కసారిగా అప్రమత్తమైంది.

 Mamta Banerjee Assets Details ,  Mamatha Banerjee, West Bengal, Nandhigram,truna-TeluguStop.com

పోలీసులు లేని సమయంలో ఆమెకు గాయం కావడంతో .ఈ గాయం వెనకాల కుట్ర దాగి ఉంది అన్న అనుమానాలు ఆమెతో పాటు పార్టీ నాయకులు కూడా వ్యక్తం చేయడం జరిగింది.

దీంతో రెండు రోజులపాటు ఆమె రెస్ట్ తీసుకోవాలని వైద్యులు సూచించిన తరుణంలో.దీదీ రెస్ట్ తీసుకుంటున్నారు.ఇదిలా ఉంటే ఇటీవల ఎన్నికల సంఘానికి సమర్పించిన అఫిడవిట్ లో ఆమె తన ఆస్తుల వివరాలను పేర్కొన్నారు. నందిగ్రామ్ నియోజకవర్గం నుండి పోటీ చేస్తున్నట్టు అఫిడవిట్ లో ఈ విషయాన్ని స్పష్టం చేశారు.మొత్తం ఆస్తుల విలువ 16.72 లక్షలేనని.కనీసం కారు కూడా లేదని, ప్రస్తుతం చేతిలో అరవై తొమ్మిది వేల రెండు వందల యాభై రూపాయలు ఉండగా బ్యాంక్ బ్యాలెన్స్ 13.53 లక్షల రూపాయలు ఉన్నట్లు  మమతా బెనర్జీ స్పష్టం చేసింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube