ఆరేండ్ల‌లో మమ్మోత్ ఏనుగుల‌ను సృష్టిస్తార‌ట‌.. అదే జ‌రిగితే అద్భుత‌మే..

ఏనుగులు అన‌గానే అంద‌రికీ కూడా సాధార‌ణంగా క‌నిపించే అంటే ఇప్పుడు మ‌నం చూస్తున్న‌ ఏనుగులే గుర్తుకు వ‌స్తాయి.కానీ లారీ కంటే కూడా పెద్ద సైజులో ఉండే మంచు యుగం ఏనుగుల గురించి ఎవ‌రికీ తెలియ‌దు కావ‌చ్చు.

 Mammoth Elephants Are Created In Arendal .. It Would Be Wonderful If The Same Ha-TeluguStop.com

ఇవి ఒక‌ప్పున‌డు యూరప్, ఉత్తర అమెరికాతో పాటు ఉత్తర ఆసియాలో ప్రాంతాల్లో మ‌నుగ‌డ సాగించాయి.ఇవి ఇప్పుడుఉన్న ఏనుగుల కంటే కూడా మూడు రెట్లు పెద్ద‌గా ఉండేవ‌ట‌.

వీటినే మమ్మోత్ అని పిలిచేవారు.ఈ ఏనుగుల ఆధారంగా గ‌తంలో ఐస్ ఏజ్ సిరీస్ మూవీలు కూడా వ‌చ్చాయి.

అందులో వీటిని అచ్చుగుద్దిన‌ట్టు చూపించారు.

ఇవి నున్న‌గా కాకుండా వాటి శ‌రీరం నిండా చలిని తట్టుకునే విధంగా బొచ్చుతో క‌ప్పి ఉండేది.

ఇవి కేవ‌లం మంచు ప్రాంతంలో మాత్ర‌మే క‌వ‌సించేవి.ఇవి ఇప్ప‌టి కాలానికి స‌రిగ్గా 10వేల ఏండ్ల క్రితం ఉండేవ‌ట‌.

ఇవి ఒక్కో ఏనుగు 11 నుంచి 12 అడుగుల వ‌ర‌కు ఎత్తుతో భారీ ఆకారంలో ఉండేవంట‌.ఒక్కో ఏనుగు ఎంత లేద‌న్నా కూడా 6 టన్నుల బరువు ఉండేవంట‌.

కానీ ఇవి రాను రాను వాతావ‌ర‌ణ ప‌రిస్థితులు వేడెక్కడంతో పాటు మ‌న పూర్వీకులు వాటిని ఎక్కువ‌గా వేటాడ‌టంతో అవి అంద‌రించిపోయాయంట‌.అయితే వీటిని మ‌ళ్లీ పుట్టించేందుకు ఏర్పాట్లు జ‌రుగుతున్నాయి.

Telugu Crate Elephant, Mammoth-Latest News - Telugu

అంత‌రించిపోయినా ఈ ఏనుగుల‌ను హైబ్రీడ్ విధానంలో మ‌ళ్లీ సృష్టించేందుకు ప్ర‌యోగాలు న‌డుస్తున్నాయి.అమెరికాకు చెందినటువంటి బయోసైన్స్ అండ్ జెనెటిక్స్ కంపెనీ కొలొస్సల్ సంస్థ ఈ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది.రాబోయే ఆరేండ్ల‌లో తిరిగి ఈ ఏనుగుల్ని సృష్టించేందుకు దాదాపుగా రూ.110 కోట్లతో ప్ర‌యోగాల‌కు సిద్ధం అయింది.కాగా ఈ ప్రాజెక్టు పేరును మమ్మోత్‌లకు పునరుజ్జీవంగా పెట్టారు.అయితే వీటిని అన్ని వాతావ‌ర‌ణ ప‌రిస్థితుల‌ను త‌ట్టుకుని జీవించే విధంగా సృష్టించేందుకు రెడీ అవుతున్నారంట‌.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube