ఏజెంట్ మూవీలో మమ్ముట్టి చేయబోయే పాత్రపై క్లారిటీ... గురుశిష్యులుగా

స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి సైరా నరసింహారెడ్డి తర్వాత చేస్తున్న మూవీ ఏజెంట్.అక్కినేని నాగార్జున నట వారసుడు అఖిల్ హీరోగా ఈ మూవీ తెరకెక్కుతుంది.

 Mammootty Role In Agent Movie, Tollywood, Akkineni Akhil, Surendar Reddy, Malaya-TeluguStop.com

భారీ బడ్జెట్ తో స్పై థ్రిల్లర్ గా యాక్షన్ బ్యాక్ డ్రాప్ కథాంశంతో ఈ మూవీని దర్శకుడు సురేందర్ ఆవిష్కరిస్తున్నారు.ఇదిలా ఉంటే ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ అయ్యింది.

అఖిల్ డిఫరెంట్ లుక్ లో ఈ మూవీలో కనిపించబోతున్నాడు.ఇదిలా ఉంటే ఈ సినిమాలో మరో కీలక పాత్ర కోసం సురేందర్ రెడ్డి మలయాళీ మెగాస్టార్ మమ్ముట్టిని రంగంలోకి దించాడు.

యాత్ర సినిమా తర్వాత మమ్ముట్టి తెలుగులో చేస్తున్న మూవీ ఇదే కావడం విశేషం.
ఇక ఈ సినిమాలో ఈ మలయాళీ స్టార్ విలన్ గా నటిస్తాడనే టాక్ వినిపించింది.

అయితే తాజాగా అతని పాత్ర గురించి క్లారిటీ వచ్చింది.ఏజెంట్ సినిమాలో మమ్ముట్టి విలనీ పాత్రలో కనిపించడం లేదని టాక్ వినిపిస్తుంది.

అఖిల్, మమ్ముట్టి ఇద్దరూ కూడా ఇండియన్ ఆర్మీలో సీక్రెట్ ఏజెంట్స్ గా ఒక టెర్రరిస్ట్ మిషన్ కోసం పనిచేసే వ్యక్తులుగానే కనిపిస్తారని ఫిలిం నగర్ లో వినిపిస్తున్న మాట.ఓ విధంగా చెప్పాలంటే సినిమాలో గురుశిష్యులుగా వారిద్దరి పాత్రలు ఉంటాయని, అలాగే పోటాపోటీగా వారి పాత్రలని సురేందర్ రెడ్డి డిజైన్ చేసినట్లు సమాచారం.మమ్ముట్టికి కూడా యాక్షన్ సీక్వెన్స్ సినిమాలో ఉంటాయని, హీరో రేంజ్ లోనే అతనిని ప్రెజెంట్ చేయబోతున్నట్లు బోగట్టా .మరి ఇందులో వాస్తవం ఎంత అనేది తెలియాలంటే చిత్ర యూనిట్ అఫీషియల్ గా స్పందించే వరకు వేచి చూడాల్సిందే.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube