సౌత్ ఇండియాలో హీరోయిన్లుగా మలయాళీ భామలు ఇప్పుడు హవా సృష్టిస్తున్నారు.చాలా మంది అందాల భామలు మల్లు ఇండస్ట్రీ నుంచి వచ్చి నార్త్ భామల తరహాలో గ్లామర్ ప్రదర్శనలు చేయకుండా తమ నటనతో స్టార్ హీరోయిన్లుగా జెండా పాతేస్తున్నారు.
ఒకప్పటిలా కాకుండా మన దర్శకులు కూడా టాలెంటెడ్ హీరోయిన్స్ కి ప్రాధాన్యత ఇస్తున్నారు.స్టార్ హీరోల సినిమాలలో కూడా వారికే అవకాశం ఇస్తున్నారు.
ప్రస్తుతం సర్కారు వారి పాట సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తుంది అంటే అదే కారణం ఇదిలా ఉంటె హీరోయిన్, సింగర్ గా టాలీవుడ్ లో సత్తా చాటిన అందాల భామ మమతా మోహన్ దాస్, యమదొంగ సినిమాతో హీరోయిన్ గా టాలీవుడ్ లో అడుగుపెట్టిన ఈ అమ్మడు చాలా తక్కువ సినిమాలలో నటించింది.
చివరిగా కేడీ సినిమాలో నాగార్జునకి జోడీగా నటించింది.
తరువాత టాలీవుడ్ కి దూరమైంది.పెళ్లి చేసుకొని సెటిల్ అయ్యే సమయంలో క్యాన్సర్ బారిన పడి దానిని జయించింది.
అదే సమయంలో విడాకులు కూడా తీసుకొని మరల మాతృభాషలో నటిగా రీఎంట్రీ ఇచ్చింది.అక్కడ వరుస సినిమాలు చేస్తుంది.
అయితే 12 ఏళ్ల తర్వాత ఇప్పుడు టాలీవుడ్ లో తిరిగి రీ ఎంట్రీ ఇస్తుంది.అయితే అది స్ట్రైట్ సినిమా కాదు.
కోలీవుడ్ లో విశాల్, ఆర్య కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఎనిమీ సినిమాలో ఈమె ఒక హీరోయిన్ గా నటిస్తుంది.దాంతో పాటు ప్రభుదేవా దర్శకత్వంలో తెరకెక్కుతున్న బైలింగ్వల్ సినిమాలో కూడా హీరోయిన్ గా కన్ఫర్మ్ అయ్యింది.
ఈ సినిమాలో సత్తా చాటితే మళ్ళీ తెలుగు, తమిళ్ బాషలలో ఈ అమ్మడు బిజీ అయ్యే అవకాశం ఉంది.