బాబు కి హ్యాండ్...జగన్ కి మమతా ఫోన్..???  

Mamatha Call To Ys Jagan-chandrababu,elections,mamatha,political Updates,tdp,ycp,ys Jagan

 • ఏపీ లో జరిగిన ఎన్నికలు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా ఉన్నాయని, జగన్మోహన్ రెడ్డి ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం తధ్యమని, ఇప్పటికే పలు సర్వేలు ప్రకటించిన విషయం విధితమే. ఎన్నికల ముందు నుంచి కూడా జాతీయస్థాయి సర్వేలు సైతం జగన్ దే అధికారమని చెప్పకనే చెప్పాయి.

 • బాబు కి హ్యాండ్...జగన్ కి మమతా ఫోన్..???-Mamatha Call To YS Jagan

 • ఏపీ ప్రజలు మూకుమ్మడిగా జగన్ మోహన్ రెడ్డి కే పట్టం కట్టారని ఎన్నికలు జరుగుతున్న సమయంలో లో చంద్రబాబు ప్రవర్తించిన తీరు స్పష్టంగా అర్థం అవుతోంది

  ఈ క్రమంలోనే ఇప్పటికే జగన్ కి వస్తున్న విశేష ఆదరణ గెలుపుని తగ్గించి చూపించాలనే ఉద్దేశంతో ఈవీఎంలు పనిచేయలేదు , ఎన్నికల కమిషన్ విధులు సక్రమంగా నిర్వహించలేదు, వైసిపి కి అనుకూలంగా కేంద్రం పావులు కదిపింది అంటూ టీడీపీ వింత వాదనలు తెరపైకి తీసుకువచ్చింది. దాంతో చంద్రబాబు తీరుపై ఏపీ ప్రజలు సైతం విస్మయం వ్యక్తం చేశారు.

 • అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక్క పౌరుడు కూడా ఎన్నికలు జరిగిన విధానంపై ఒక్క విమర్శ కూడా ఇప్పటికీ చేయలేదు కానీ…

  Mamatha Call To YS Jagan-Chandrababu Elections Mamatha Political Updates Tdp Ycp Ys Jagan

  తెలుగుదేశం పార్టీకి అనుకూల పచ్చ మీడియా మాత్రం జగన్ విజయం ఈవీఎంలు పుణ్యమే అంటూ మరో బురదజల్లే ప్రయత్నానికి తెరలేపారు. అందుకోసం రోజు ఈవీఏం లు పని చేయకపోవడం వల్లనే ఇదంతా జరిగింది అంటూ రోజుకో న్యూస్ తెరపైకి తీసుకువస్తున్నారని విమర్శలు చేస్తున్నారు వైసీపీ నేతలు. ఇదిలాఉంటే ఇప్పటి వరకూ జరిగిన పరిణామాలు ఒకెత్తయితే తాజాగా జరుగుతూన పరిణామాలు చంద్రబాబు ని విస్మయానికి గురిచేస్తున్నాయి.

 • అది ఏంటంటే…

  పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నుంచి జగన్ కు ఫోన్ రావడమే. మమతా బెనర్జీ జగన్ కి ఫోన్ చేసి అందరికంటే ముందుగానే శుభాకాంక్షలు తెలిపారని టాక్ వినిపిస్తోంది. తనకు అందిన ఇంటిలిజెన్స్ రిపోర్ట్ ఆధారంగానే జగన్ కి మమత ఫోన్ చేశారని, జగన్ అధికారంలోకి రావడం పక్క అనే ఇన్ఫర్మేషన్ మమత వద్ద ఉందని, భవిష్యత్తులో ప్రధానిగా పోటీపడాలని ఉంటున్న మమతా బెనర్జీ ఎందుకైనా మంచిదని కోణంలో జగన్ కు ఫోన్ చేసి ఉంటారనే అభిప్రాయాలని విశ్లేషకులు వ్యక్తపరుస్తున్నారు.

 • అయితే భవిష్యత్తులో మరిన్ని పరిణామాలు టీడీపీ నేతలకి షాకుల మీద షాకులు ఇచ్చే విధంగా ఉంటాయని విశ్లేషకులు భావిస్తున్నారు.