తెలంగాణ రాజకీయాలలోకి మమతా ఎంట్రీ.. అసలు వ్యూహం ఇదే

తెలంగాణ రాజకీయాలు రోజురోజుకు రకరకాల మలుపులు తిరుగుతూ రసవత్తరంగా మారుతున్న పరిస్థితి ఉంది.అయితే ఇప్పటికే తెలంగాణలో వరి ధాన్యం కొనుగోళ్ళ విషయంలో ఇటు బీజేపీ, టీఆర్ఎస్ మధ్య మాటల తూటాలు పేలుతున్న పరిస్థితి ఉంది.

 Mamata's Entry Into Telangana Politics This Is The Real Strategy Telangana Polit-TeluguStop.com

గత రెండు సార్వత్రిక ఎన్నికల కంటే ముందు తెలంగాణలో కేసీఆర్ కు పెద్దగా ఎదురులేనటువంటి పరిస్థితి ఉంది.కాని అప్పటి పరిస్థితికి ఇప్పటి పరిస్థితి పూర్తి భిన్నంగా ఉన్న పరిస్థితి ఉంది.

అయితే ఇక వచ్చే రెండున్నరేళ్లలో సార్వత్రిక ఎన్నికలు జరగనున్న తరుణంలో ఇప్పటి నుండే ప్రతిపక్షాలు క్షేత్ర స్థాయిలో కార్యాచరణను మొదలు పెట్టిన సందర్భం ఉంది.అయితే తెలంగాణ రాజకీయాలలో మరో సంచలనం జరిగే అవకాశం కనిపిస్తోంది.

పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ దేశ వ్యాప్తంగా తృణమూల్ కాంగ్రెస్ ను విస్తరించాలనుకుంటున్న నేపథ్యంలో తెలంగాణలో కూడా తృణమూల్ కాంగ్రెస్ ను విస్తరించాలని మమతా భావిస్తున్నట్టు సమాచారం.

Telugu @cm_kcr, Telangana-Political

అయితే దేశ స్థాయిలో బీజేపీకి వ్యతిరేకంగా ముందుకెళ్తున్నపరిస్థితుల్లో తెలంగాణలో కూడా ఇప్పుడిప్పుడే బలపడాలని భావిస్తున్న బీజేపీకి వ్యతిరేకంగా మమతా బెనర్జీ ముందుకెళ్ళే అవకాశం కనిపిస్తోంది.అయితే బీజేపీ పార్టీ కి వ్యతిరేకంగా ముందుకెళ్తారని ఒక ప్రచారం జరుగుతుండగా, కేసీఆర్ కు వ్యతిరేకంగా ముందుకెళ్తారని ఒక ప్రచారం నడుస్తోంది.అయితే ప్రస్తుతానికి ప్రచారంలా రకరకాల అంశాలు ఉన్నా మమతా బెనర్జీ వచ్చే సార్వత్రిక ఎన్నికల సమయంలో రంగంలోకి దిగితే తెలంగాణ రాజకీయ ముఖ్య చిత్రం మారే అవకాశం వంద శాతం ఉంది.

అంతేకాక ఇప్పటికే చాలా వరకు క్షేత్ర స్థాయిలో బీజేపీని నిలువరించడానికి కేసీఆర్ తీవ్ర ప్రయత్నాలు చేస్తున్న విషయం తెలిసిందే.మరి రానున్న రోజుల్లో మమతా బెనర్జీ ఎంట్రీపై మరింత క్లారిటీ వచ్చే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube