నీతి ఆయోగ్ కు ఆ ముగ్గురు సీ ఎం లు దూరం  

Mamata,kcr Are Not Attending The Niti Ayog Meeting-mamatha Benarji,narendra Modi,niti Ayog Meeting,నీతి ఆయోగ్

ఇటీవల సార్వత్రిక ఎన్నికలు ముగిసిన సంగతి తెలిసిందే. అయితే ఈ ఎన్నికల్లో విజయం సాధించి మరోసారి ఎన్డీయే కూటమి కేంద్రంలో ప్రభుత్వాన్ని స్థాపించింది. ఈ క్రమంలో నరేంద్ర మోడ్ రెండోసారి ప్రధాని గా ప్రమాణ స్వీకారం కూడా చేశారు..

నీతి ఆయోగ్ కు ఆ ముగ్గురు సీ ఎం లు దూరం -Mamata,KCR Are Not Attending The Niti Ayog Meeting

అయితే ఆయన రెండో సారి ప్రధాని గా ప్రమాణస్వీకారం చేసిన తరువాత తొలిసారిగా ఆయన అధ్యక్షతన నీతి ఆయోగ్ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో పాల్గొనడానికి అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రుల తో పాటు పలు శాఖల మంత్రులు కూడా హాజరుకావాల్సి ఉంది. ఈ క్రమంలో ఇప్పటికే ఏపీ సి ఎం జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ కూడా వెళ్లిపోయారు.

అయితే తెలంగాణా సీ ఎం కేసీఆర్ ఈ సమావేశానికి హాజరుకావాల్సి ఉండగా ఆయన ఈ సమావేశానికి హాజరు కాలేకపోతున్నట్లు తెలుస్తుంది. నీతి ఆయోగ్ వల్ల ఎలాంటి ప్రయోజనం కనిపించడం లేదని, కావున ఈ సమావేశానికి హాజరుకానని బెంగాల్ సీఎం మమతా బెనర్జీ తేల్చి చెప్పేసిన సంగతి తెలిసిందే.

అయితే ఇప్పుడు తాజాగా కేసీఆర్ కూడా ఈ సమావేశానికి హాజరుకాలేకపోతున్నట్లు తెలుస్తుంది. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీ పర్యటనలోనే ఉన్నారు.

అయితే బిజీ షెడ్యూల్‌ కారణంగా. ఈ సమావేశానికి హాజరుకాలేకపోతున్నారు..

ఇక ఈ ఇద్దరి సీఎంల బాటలోనే పంజాబ్ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరిందర్ సింగ్ కూడా చేరారు. ఆయన కూడా సాయంత్రం జరిగే నీతి ఆయోగ్ సమావేశానికి హాజరు కాలేకపోతున్నట్లు సమాచారం.