మోడీ పై సీరియస్ కామెంట్లు చేసిన మమత..!!

ఎన్నికల సంఘం(ఈసీ) మోడీ ఆదేశాల మేరకు నడుచుకుంటుంది అంటూ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సీరియస్ వ్యాఖ్యలు చేశారు.మోడీ కి ఎప్పుడు ఇష్టమైతే అప్పుడు ఎన్నికల సంఘం(ఈసీ) ఎన్నికలకు వెళ్తుందని వ్యవస్థ ఆ విధంగా మారిపోయింది అంటూ మండిపడ్డారు.

 Mamata Makes Serious Comments On Modi Mamatha Banerjee, Modi, Bengal Poltics , E-TeluguStop.com

ఇదిలా ఉంటే ప్రస్తుతం రాష్ట్రంలో కరోనా తగ్గుముఖం పట్టడం జరిగిందని ఈ టైంలో ఉప ఎన్నికలు నిర్వహిస్తే మంచిదని స్పష్టం చేశారు.రాష్ట్రంలో పాజిటివిటీ రేటు 30 శాతం ఉన్న సమయంలో ఎన్నికలు జరిపారు.

ప్రస్తుతం మూడు శాతం కంటే ఇంకా తక్కువగానే ఉంది ఈ టైంలో ఉప ఎన్నికలు జరిపితే బెటర్ అని మమత స్పష్టం చేశారు.ఎన్నికల సంఘం మీరు ఎంత చెబితే అంత అన్నట్టుగా వ్యవహరిస్తుంది కదా కాబట్టి ఎన్నికల సంఘం(ఈసీ) కి ఆదేశాలు ఇవ్వండి అంటూ ఎటకారంగా తనదైన శైలిలో మమతా బెనర్జీ కామెంట్లు చేసింది.

మొన్న జరిగిన బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలలో మమతా బెనర్జీ పోటీ చేసిన నందిగ్రామ్ నియోజకవర్గంలో ఓటమిపాలైంది.అయినా గాని సీఎంగా ఆమె ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది.

దీంతో ఆరు నెలల్లో మరో నియోజకవర్గంలో పోటీ చేసి గెలవాల్సిన పరిస్థితి ప్రస్తుతం ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube