ఉప ఎన్నికలలో విజయం తర్వాత మమతా బెనర్జీ కీలక వ్యాఖ్యలు..!!

తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ భవానీపూర్ ఉప ఎన్నికలలో 50 వేల మెజార్టీ సాధించి గెలిచిన సంగతి తెలిసిందే.గెలిచిన అనంతరం తనకు విజయాన్ని ఇచ్చిన భవానీపూర్ ప్రజలకు కృతజ్ఞతలు అని చెప్పుకొచ్చారు.భారతజాతి అక్క చెల్లెలు తన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు అని స్పష్టం చేశారు.2016 లో జరిగిన ఎన్నికలలో ఈ నియోజకవర్గంలో కొన్ని వార్డుల్లో తక్కువ ఓట్లు వచ్చాయి.కానీ ఈసారి మాత్రం ఆ పరిస్థితి లేదు.ఓటర్లలో దాదాపు 46 శాతం బెంగాలతరులే.అయినా కానీ తనను ఎంతగానో ఆదరించి ఓటేశారని తెలిపారు.ఈ నియోజకవర్గంలో గుజరాతీలు, పంజాబీలు, మార్వాడీలు, బీహారీలు.

 Mamata Banerjee's Key Remarks After Her Victory In The By-elections ,  Mamata Ba-TeluguStop.com

అత్యధిక సంఖ్యలో ఉంటారు.దాదాపు 40 శాతానికి పైగానే ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారు కావడంతో భవానీపూర్ మినీ భారత్ అని కూడా పిలుస్తుంటారు.

ఈ క్రమంలో ఈ నియోజకవర్గంలో మమతా బెనర్జీ గెలవడంతో.సీఎం పదవి కి.డోకా లేకుండా పోయింది.ఈ ఏడాది మార్చి ఏప్రిల్ మాసం లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో మమతాబెనర్జీ నందిగ్రామ్ నియోజకవర్గం నుండి పోటీ చేసి ఓడిపోయారు.

అయితే ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ గెలవడంతో ముఖ్యమంత్రి పదవి అధిరోహించారు.ఈ నేపథ్యంలో ఓడిపోయి ముఖ్యమంత్రి పదవి చేపట్టిన వ్యక్తి ఆరు నెలల్లో ప్రజాక్షేత్రంలో గెలిచి పదవిని కాపాడుకునే పరిస్థితి ఉన్న తరుణంలో భవానీపూర్.

నియోజకవర్గంలో పోటీ చేసి మమతాబెనర్జీ గెలవడం జరిగింది.ఈ సందర్భంగా మళ్లీ తాను ముఖ్యమంత్రిగా కొనసాగించడానికి.ఓటు వేసి గెలిపించిన భవానీపూర్ ప్రజలందరికీ, భారత ఎన్నికల సంఘానికి కూడా కృతజ్ఞతలు తెలిపారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube