మమతల తల్లి : పికే వ్యూహంతో జాతీయ రాజకీయాల్లోకి జగన్ ?

దేశవ్యాప్తంగా కేంద్ర అధికార పార్టీ బీజేపీపై వ్యతిరేకత రోజురోజుకు పెరుగుతోంది.ఎన్డీఏలోనే మిత్ర పక్షాలు సైతం బీజేపీకి దూరం అవుతున్నాయి.

 Mamata Banerjee Invites Jagan To Enter National Politic  Jagan, Ysrcp, Ap, Telan-TeluguStop.com

వరుసగా వివిధ రాష్ట్రాల్లో జరుగుతున్న ఎన్నికలలోనూ బీజేపీకి ఓటమే ఎదురవుతోంది.ఇలా ఎన్నో రకాలుగా బిజెపి ఇబ్బందులు పడుతున్నా, తమతో సన్నిహితంగా ఉంటూ అవసరమైన సందర్భాల్లో తమకు మద్దతు ఇస్తూ, ఆదుకుంటున్న ప్రాంతీయ పార్టీల విషయంలో కేంద్రం మాత్రం సానుకూల వైఖరితో ఉండడం లేదు.

కేవలం తమకు మద్దతు ఇవ్వడం వరకే మీ పని,  మీ రాష్ట్రాలకు మేము మేలు ఏమి చేయము అన్నట్లుగానే కేంద్రం ఉంటూ వస్తోంది.బిజెపి నుంచి ప్రత్యక్షంగానో, పరోక్షంగానో ఇస్తున్న మద్దతు ఉపసంహరించుకుంటూ బయటకు వచ్చేస్తున్నాయి.

ఇక బీజేపీకి ఇప్పుడు ప్రధాన రాజకీయ ప్రత్యర్థి ఎవరైనా ఉన్నారంటే అది పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అన్నట్లుగానే పరిస్థితి ఉంది.

కేంద్రం ఎన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టిన, ఆమె ఢీ కొట్టేందుకు ఎక్కడ వెనుకడుగు వేయడం లేదు.

ప్రస్తుతం హోరాహోరీగా పశ్చిమబెంగాల్లో ఎన్నికల ప్రచారం నడుస్తోంది.మళ్ళీ మమత మూడోసారి అధికారంలోకి వచ్చే అవకాశం కనిపిస్తోంది.

ఇదిలా ఉంటే ఎన్డీఏ కు వ్యతిరేకంగా మమత బలమైన ప్రత్యామ్నాయ కూటమి ఏర్పాటు చేసేందుకు సిద్ధమవుతున్నారు.ఈ నేపథ్యంలోనే బీజేపీయేతర ముఖ్యమంత్రులకు ఆమె లేఖ రాశారు.

సోనియాగాంధీ, శరద్ పవార్, డీఎంకే అధినేత స్టాలిన్ కెసిఆర్ జగన్ ఇలా అందరిని ఈ కూటమిలో కి తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు.ముఖ్యంగా కేసీఆర్, జగన్ పై మమత ఎక్కువగా ఆశలు పెట్టుకున్నారు.

బీజేపీయేతర కూటమి లో వీరిని కీలకం చేయాలని ఆమె నిర్ణయించుకున్నారు.

Telugu Jagan, Narendra Modi, Telangana, Ysrcp-Telugu Political News

దీనికి రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కారణంగా తెలుస్తోంది.2019 ఎన్నికల్లో వైసీపీకి 151 సీట్లు తో అఖండ మెజారిటీని అందించడంలో ప్రశాంత్ కిషోర్ వ్యూహాలు బాగా పనిచేశాయి.ఇప్పుడు మమత కు ప్రశాంత్ కిషోర్ వ్యూహాలు అందిస్తున్నారు.

బీజేపీకి వ్యతిరేకంగా ఆయన ప్రాంతీయ పార్టీలను గెలిపించే బాధ్యతను తీసుకుంటున్నారు.ఇప్పుడు అదే ప్రశాంత్ కిషోర్ సలహాతో మమత జగన్ కెసిఆర్ లను మరింత యాక్టివ్ చేసి , జాతీయ రాజకీయాల్లో బిజెపిని ఎదిరించేందుకు ఒక కూటమిని ఏర్పాటు చేసి , రాబోయే లోక్ సభ ఎన్నికలలో ఆ కూటమిని అధికారంలోకి తెచ్చి, బీజేపీని అధికారానికి దూరం చేయాలని చూస్తోంది.

ఇక ఈ ఆఫర్ ను పికే సలహాతో జగన్ ఉపయోగించుకుంటే తలెత్తే రాజకీయ మార్పులు అన్నీ ఇన్నీ కావు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube