ఆ.. ఎమ్యెల్యే ప్రమాణ స్వీకారం ఆపాలంటూ ....?

తెలంగాణాలో ఎన్నికల్లో గెలిచిన ఓ అభ్యర్థి ప్రమాణస్వీకారం చేయకుండా ఆపాలంటూ … అతని ప్రత్యర్థి ఎన్నికల సంఘాన్ని కోరిన సంఘటన ఇబ్రాహీంపట్నంలో చోటుచేసుకుంది.రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో బీఎస్పీ అభ్యర్థి మల్‌రెడ్డి రంగారెడ్డి, టీఆర్ఎస్ అభ్యర్థి మంచిరెడ్డి కిషన్‌ రెడ్డి మధ్య పోటీ నువ్వా నేనా అన్నట్టుగా సాగింది.

 Malreddy Rangareddy Allegation To Manchireddy Kishan Reddy-TeluguStop.com

ఈ టఫ్ ఫైట్ లో చివరకు మంచిరెడ్డి కిషన్‌రెడ్డి 376 ఓట్ల స్వల్ప మెజారిటీతో గెలుపొందారు.అయితే ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో రీకౌంటింగ్ నిర్వహించాలని మల్‌రెడ్డి రంగారెడ్డి ఎన్నికల సంఘాన్ని కోరారు.

తాజాగా ఆయన సచివాలయంలో రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి రజత్‌ కుమార్‌ను కలిశారు.తమ నియోజకవర్గంలో రిటర్నింగ్‌ అధికారులు కేటీఆర్‌ ఆదేశాల మేరకు నడుచుకున్నారని, ఓట్ల లెక్కింపులో అవకతవకలు జరిగాయని ఆరోపించారు.మంచిరెడ్డి కిషన్‌ రెడ్డి కుమారుడు మొబైల్‌ ఫోన్‌తో ఓట్ల లెక్కింపు కేంద్రంలోకి వచ్చారని తెలిపారు.18వ రౌండ్‌ నుంచి తన మెజార్టీ తగ్గించారని ఆరోపించారు.న్యాయంగా గెలవని మంచిరెడ్డి కిషన్‌ రెడ్డి ప్రమాణస్వీకార కార్యక్రమాన్నినిలిపివేయాలని మల్‌రెడ్డి ఈసీని కోరారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube