కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతు వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్నాయని విమర్శించిన భట్టి విక్రమార్క, వీహెచ్..

కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతు వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్నాయని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క వీహెచ్ హనుమంతరావు విమర్శించారు.ఖమ్మం జిల్లా వైరా మండలం రెబ్బవరం గ్రామంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రచ్చబండ కార్యక్రమం జరిగింది, ఈ కార్యక్రమంలో సీఎల్పీ నాయకుడు మల్లు భట్టి విక్రమార్క, మాజీ పిసిసి అధ్యక్షుడు మీ హనుమంతరావు, పాల్గొన్నారు.

 Mallu Bhatti Vikramarka Vh Fires On State And Central Govt In Wyra Rachcha Banda-TeluguStop.com

నాయకుడు మల్లు భట్టి విక్రమార్క వీహెచ్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు నేటికీ ప్రజలకు అందడం లేదని విమర్శించారు కాంగ్రెస్ ప్రభుత్వంలో పేదలకు ఇచ్చిన అసైన్డ్ భూములన లాక్కుని రియల్ ఎస్టేట్ కార్పొరేట్ సంస్థలకు కట్టబెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు.కేంద్రంలో మోడీ ప్రభుత్వం ప్రభుత్వరంగ సంస్థలను కార్పొరేట్ సంస్థలకు కట్టబెట్టిందని అన్నారు రాష్ట్రంలో రైతులు తీసుకున్న అప్పులు రుణమాఫీ చేయకపోవడంతో అవి పెరిగి అప్పుల పాలయ్యారని దీంతో అప్పులు తీరిక ఆత్మహత్యలు చేసుకున్నారని అన్నారు.

ఇది గమనించిన రాహుల్ గాంధీ వరంగల్ సభలో రైతు డిక్లరేషన్ ప్రకటించి అధికారంలోకి వచ్చిన తరువాత ఓకే సరి 2 లక్షలు బృణ మాపి చేస్తాం,గిట్టుబాటు ధర ఇచ్చి పెట్టుబడి కి 15 వేలు ఎకరనికి అందించడం జరుగుతుందని అన్నారు.

భూమి లేని రైతులకు అండగా ఊంటాం,ధరలు పెంచి రైతుల జివితలతొ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మోసం చేస్తున్నారు.

వడ్డీ లేని రుణాలు ఇస్తాం,అసలు భూమి లేని వారికి ఉపాధి హామీ పథకం లో నమోదు చేసుకున్న వారి అకౌంట్ అకౌంట్ లో పన్నెండు వేలు నగదు ఇస్తామని తెలిపారు.కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ధాన్యం కొనుగోలు చేయకుండా రైతులను మోసం చేశారు,కాంగ్రెస్ అధికారం లోకి వచ్చిన ధాన్యం కి 2500 ఇతర పంటలకు మద్దతు ధర కల్పిస్తామని అన్నారు.

రైతుల కోసం కాంగ్రెస్ ఎప్పుడు అండగా ఉంటుంది రైతు భయపడాల్సిన అవసరం లేదు అందుకే రాహుల్ గాంధీ రైతు డిక్లరేషన్ ప్రకటించడం జరిగింది.

విత్తన చట్టం తీసుకుని వచ్చి నకిలీ విత్తనాలు నిర్ములన చేస్తాం రైతుల కొసం కమిషన్ ఏర్పాటు చేస్తాం,కాంగ్రెస్ ప్రభుత్వాం పేదలకు ఇచ్చిన భూముల ప్రభుత్వం లాక్కుంటుంటి దళిత బంధు రాష్ట్ర వ్యాప్తంగా ఇవ్వాలని ధరణి పొర్టల్ మారుస్తాం అన్నారు.

అనంతరం ఖానాపురం రెబ్బవరం గ్రామలకు చెందిన సమరు 30 కుటుంబాలు బట్టి విక్రమార్క ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ లో చేరారు.వారికి భట్టి విక్రమార్క పార్టీ కండవ కప్పి పార్టీ పార్టీలోకి ఆహ్వానించారు.

ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రేస్ అధ్యక్షుడు పువ్వాల్ల దుర్గా ప్రసాద్, మాలోత్ రాందాస్ నాయక్ ,పొట్ల నాగేశ్వరరావు, కిసాన్ఖేత్ రాష్ట్ర కన్వీనర్ దాసరి దానేలు,శీలం వెంకట నర్సి రెడ్డి ,రెబ్బవరం మాజీ సర్పంచ్ గుత్త కళావతి,పమ్మి అశోక్, పాల్గొన్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube