రవితేజకి జోడీగా కర్నన్ ఫేమ్ రాజీషా విజయన్

మాస్ మహారాజ్ రవితేజ ప్రస్తుతం రమేష్ వర్మ దర్శకత్వంలో ఖిలాడీ మూవీ చేస్తున్నాడు.ఈ మూవీ షూటింగ్ దశలో ఉంది.

 Mallu Beauty Rajisha Vijayan Romance With Raviteja, Tollywood, Sarath Mandava, K-TeluguStop.com

ఈ సినిమా కోసం రవితేజ మరోసారి ద్విపాత్రాభినయం చేస్తున్నాడు.ఇదిలా ఉంటే థ్రిల్లర్ కమర్షియల్ జోనర్ ఖిలాడీ మూవీ తెరకెక్కుతుంది.

అలాగే రవితేజ మార్క్ కామెడీ టచ్ కూడా సినిమాలో ఉంటుందని తెలుస్తుంది.డింపుల్ హయాతి, మీనాక్షి చౌదరి ఈ మూవీలో రవితేజకి జోడీగా నటిస్తున్నారు.

ఇదిలా ఉంటే శరత్ మండవ దర్శకత్వంలో రవితేజ కొత్త సినిమాని ఇప్పటికే స్టార్ట్ చేశారు.ఈ మూవీ షూటింగ్ ఆగష్టులో స్టార్ట్ అవుతుందని తెలుస్తుంది.

ప్రస్తుతం మూవీ ప్రీప్రొడక్షన్ దశలో ఉంది.ఇదిలా ఉంటే ఈ మూవీ కథాంశం 1980-1990 బ్యాక్ డ్రాప్ లో పీరియాడిక్ ఎలిమెంట్స్ తో ఉండబోతుందని తెలుస్తుంది.

Telugu Khiladi, Mallurajisha, Ramesh Varma, Raviteja, Sarath Mandava, Tollywood-

అలాగే రవితేజ మార్క్ వినోదం ఈ సినిమాలో ఉంటుందని, కొన్ని రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ ఆధారంగా ఈ సినిమా కథ ఉండబోతుందని టాక్ వినిపిస్తుంది.ఇదిలా ఉంటే ఈ మూవీకి సంబంధించి మరో కీలక అప్డేట్ బయటకొచ్చింది.ఇందులో రవితేజకి జోడీగా మలయాళీ బ్యూటీ రాజీషా విజయన్ ఖరారైనట్లు తెలుస్తుంది.రీసెంట్ గా ఈ భామ తమిళంలో కర్ణన్ మూవీలో ధనుష్ కి జోడీగా నటించింది.

ఇందులో హీరోయిన్ పాత్రకి మంచి ప్రాధాన్యత ఉంటుందని ఈ నేపధ్యంలో రాజీషా విజయన్ అయితే పెర్ఫెక్ట్ అని దర్శకుడు శరత్ ఆమెకి కథ వినిపించి ఒకే చేయించుకున్నట్లు టాక్ వినిపిస్తుంది.త్వరలో దీనిపై క్లారిటీ వచ్చే అవకాశం ఉందనే మాట ఫిలిం నగర్ సర్కిల్ లో చక్కర్లు కొడుతుంది.

మొత్తానికి రవితేజ తన కొత్త సినిమాల ద్వారా కొత్త కొత్త హీరోయిన్స్ ని టాలీవుడ్ లో పరిచయం చేసే పని పెట్టుకున్నాడని అతని లైన్ అప్ చూస్తూ ఉంటే అనిపిస్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube