హీరోలంతా అదే టైపు.. మల్లికా శెరావత్ హాట్ కామెంట్స్?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో గ్లామరస్ బ్యూటీగా తెరపై అద్భుతమైన నటనను కనబరిచి ఎంతోమంది కుర్రాళ్లమనసు కొల్లగొట్టిన నటి మల్లికా షెరావత్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.కెరియర్ మొదట్లో మల్లికా శెరావత్ నటించిన మర్డర్ అనే సినిమా ద్వారా ఎంతో ఫేమ్ సంపాదించుకున్న ఈమె ఆ తర్వాత ఎన్నో బోల్డ్ పాత్రలలో నటిస్తూ ఎనలేని క్రేజ్ సంపాదించుకుంది.

 Mallika Sherawat Hot Comments About Heros-TeluguStop.com

గత కొద్దిరోజుల నుంచి ఇండస్ట్రీకి దూరంగా ఉన్న మల్లికా శెరావత్ ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వడానికి ప్రయత్నిస్తోందని సమాచారం వినబడుతోంది.

ఈ క్రమంలోనే ఓ ఇంటర్వ్యూ సందర్భంగా మాట్లాడిన మల్లిక ఇండస్ట్రీలోకి వచ్చిన మొదట్లో ఎదుర్కొన్న క్యాస్టింగ్ కౌచ్ వివరించింది.

 Mallika Sherawat Hot Comments About Heros-హీరోలంతా అదే టైపు.. మల్లికా శెరావత్ హాట్ కామెంట్స్-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

సినిమాలలో బోల్డ్ పాత్రలో నటించడం వల్ల చాలామంది హీరోలు తనను అడ్వాంటేజ్ చేసుకోవడానికి ప్రయత్నించారన్న విషయాన్ని బయట పెట్టింది.దాదాపు హీరోలు అందరూ అలానే ఉన్నారని, తెరపై నేను అలా నటించడంతో తెర వెనుక కూడా అలా ఉంటాను అనుకోవడం పూర్తిగా పొరపాటని, నేను ఇండస్ట్రీకి కాంప్రమైజ్ అవడానికి రాలేదని.

తన కెరీర్ ను బిల్డ్ చేసుకోవడం కోసమే ఇండస్ట్రీకి వచ్చానని ఈ సందర్భంగా మల్లికా శెరావత్ పేర్కొన్నారు.

Telugu Bollywood, Casting Couch, Hot Comments, Mallika Sherawat-Movie

ఇండస్ట్రీలో కొనసాగుతున్నప్పటికీ తాను ఏ విధమైనటువంటి నైట్ పార్టీలకు గాని రాత్రిపూట దర్శకని ర్మాతలను కలవడం కోసం హోటళ్లకు వెళ్లడం కానీ చేయలేదని, అయినప్పటికీ చాలామంది నాతో కమిట్మెంట్ అడిగారన్న విషయాన్ని బయట పెట్టింది.సినిమాల్లో నటిస్తున్నప్పుడు ప్రైవేట్ గా మాతో ఉండటానికి అభ్యంతరం ఏమిటి అని అడిగిన వారు కూడా ఉన్నారు అంటూ ఈ సందర్భంగా తెలియజేశారు.ప్రస్తుతం లాస్ ఏంజెల్స్ లో ఒంటరిగా ఎంతో ప్రశాంతమైన జీవితాన్ని గడుపుతున్న మల్లిక త్వరలోనే బాలీవుడ్ రీ ఎంట్రీ కోసం ఎదురుచూస్తున్నానని, అవకాశం వస్తే తప్పకుండా సినిమాలలో నటిస్తానని పేర్కొన్నారు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు