కొత్త వ్యాపారం మొదలు పెట్టిన నాగార్జున హీరోయిన్...

ఈ మధ్యకాలంలో కొందరు సినీ సెలబ్రిటీలు దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలనే తీరులో ప్రవర్తిస్తూ ఒక పక్క సినిమాల్లో నటిస్తూనే మరో పక్క వ్యాపారాలలో కూడా పెట్టుబడులు పెడుతూ బాగానే సంపాదిస్తున్నారు.కాగా ఇప్పటికే టాలీవుడ్ లో రకుల్ ప్రీత్ సింగ్, కాజల్ అగర్వాల్, రామ్ చరణ్ తేజ్, మహేష్ బాబు, అల్లు అర్జున్, తదితర స్టార్ సినీ సెలబ్రిటీలు వ్యాపార రంగంలో దూసుకుపోతున్నారు.

 Malli Raava Movie Fame Akanksha Singh Started Restaurant Business-TeluguStop.com

కాగా వీరి సరసన తాజాగా మరో యంగ్ హీరోయిన్ చేరింది.అయితే ఆమె ఎవరో కాదు ఆకాంక్ష సింగ్.

అయితే ఆకాంక్ష సింగ్ అంటే పెద్దగా టాలీవుడ్ సినీ ప్రేక్షకులు గుర్తు పట్టరు.కానీ తెలుగులో ప్రముఖ హీరో సుమంత్ హీరోగా నటించిన “మళ్ళీ రావా” చిత్రంలోని “అంజలి” అంటే మాత్రం ఠక్కున గుర్తు పడతారు.

 Malli Raava Movie Fame Akanksha Singh Started Restaurant Business-కొత్త వ్యాపారం మొదలు పెట్టిన నాగార్జున హీరోయిన్…-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

కాగా ఈ అమ్మడు ఇటీవలే రాజస్థాన్ లోని జైపూర్ పరిసర ప్రాంతంలో ఓ కేఫ్ ని ప్రారంభించింది.అయితే ఈ కేఫ్ ప్రారంభోత్సవానికి ఎన్జీవో సంస్థలకు చెందిన కొంత మంది అనాధ పిల్లల్ని ముఖ్య అతిథులుగా ఆహ్వానించి వారితో ప్రారంభోత్సవం చేయించింది.

దీంతో ఆకాంక్ష సింగ్ చేసిన ఈ పనికి నెటిజన్లు మెచ్చుకుంటున్నారు.అయితే తన సొంత కేఫ్ ప్రారంభోత్సవం గురించి ఆకాంక్ష సింగ్ మాట్లాడుతూ తనకు చిన్నప్పటి నుంచి వ్యాపార రంగంలో రాణించాలని ఆసక్తి ఉండేదని అందువల్లనే సరైన సమయం చూసి ఈ కేఫ్ పై పెట్టుబడి పెట్టానని చెప్పుకొచ్చింది.

మరి ఆకాంక్ష సింగ్ సినిమాల్లో మాదిరిగానే వ్యాపారంలో కూడా వృద్ధి లోకి రావాలని ఆశిద్దాం….

Telugu Akanksha Singh Restaurant Business, Kanksha Singh, Malli Raava Movie, Malli Raava Movie Fame Akanksha Singh Started Restaurant Business, Telugu Actress-Movie

ఈ విషయం ఇలా ఉండగా ఆకాంక్ష సింగ్ తెలుగులో నటించిన “మళ్లీ రావా, దేవదాస్” తదితర చిత్రాలు బాక్సాఫీస్ వద్ద ప్రేక్షకులని బాగానే ఆకట్టుకున్నాయి.అంతేకాకుండా కన్నడలో ప్రముఖ స్టార్ హీరో అయిన “కిచ్చ సుదీప్” తో కలిసి హీరోయిన్ గా నటించిన పైల్వాన్ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి విజయం సాధించింది.దీంతో ఈ అమ్మడికి కన్నడలో సినిమా ఆఫర్లు బాగానే క్యూ కడుతున్నాయి.

కాగా ప్రస్తుతం ఆకాంక్ష సింగ్ హిందీలో “మే” డే అనే చిత్రంలో హీరోయిన్ గా నటిస్తోంది.

#Malli Raava #AkankshaSingh #Kanksha Singh #MalliRaava

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు