మొత్తానికి ఫేక్ వెడ్డింగ్ కార్డు తో సినిమాని బాగానే పబ్లిసిటీ చేసారుగా...

టాలీవుడ్ చలన చిత్ర పరిశ్రమలో ఒకప్పుడు పలు క్లాస్ చిత్రాలతో ప్రేక్షకులను ఎంతగానో అలరించిన ప్రముఖ హీరో “సుమంత్ అక్కినేని” గురించి సినీ పరిశ్రమలో తెలియనివారుండరు.కానీ ఈ మధ్య కాలంలో సుమంత్ అక్కినేని తన చిత్రాల కథల విషయంలో కొంతమేర శ్రద్ధ వహించక పోవడంతో గతంలో మాదిరిగా ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేక పోతున్నాడు.

 Malli Modalaindi Movie Got Huge Publicity For Fake Wedding Card-TeluguStop.com

కాగా ప్రస్తుతం సుమంత్ అక్కినేని తెలుగులో “మళ్ళీ మొదలైంది” అనే చిత్రంలో హీరోగా నటిస్తున్నాడు.కాగా ఈ చిత్రంలో పలు చిత్రాలు మరియు వెబ్ సిరీస్ లలో హీరోయిన్ గా నటించిన యంగ్ హీరోయిన్ గా నటించిన యంగ్ హీరోయిన్ “నైనా గంగూలీ” హీరోయిన్ గా నటిస్తుంది.

అలాగే ఈ చిత్రానికి తమిళ ప్రముఖ దర్శకుడు టీజీ కీర్తి కుమార్ దర్శకత్వం వహిస్తుండగా ప్రముఖ సినీ నిర్మాత కే.రాజశేఖర్ రెడ్డి నిర్మిస్తున్నాడు.తెలుగు ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ “అనూప్ రూబెన్స్” సంగీత స్వరాలను సమకూరుస్తున్నాడు.ఇటీవలే ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా విడుదల కావడంతో మంచి స్పందన లభిస్తోంది.

 Malli Modalaindi Movie Got Huge Publicity For Fake Wedding Card-మొత్తానికి ఫేక్ వెడ్డింగ్ కార్డు తో సినిమాని బాగానే పబ్లిసిటీ చేసారుగా…-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అయితే ఈ చిత్రం విడాకులు తీసుకున్న తర్వాత భార్య భర్తల జీవితం ఎలా ఉంటుందనే కథాంశంపై తెరకెక్కిస్తున్నారు.కాగా ఇటీవలే ఈ చిత్రంలోని పెళ్లి పత్రిక లీక్ కావడంతో సోషల్ మీడియా మాధ్యమాలలో తెగ వైరల్ అయ్యింది.

అంతేగాక కొందరు ఏకంగా సుమంత్ అక్కినేని రెండో పెళ్లి చేసుకోబోతున్నాడంటూ ప్రచారాలు చేయడంతో సుమంత్ తన అధికారిక సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా స్పందిస్తూ తాను రెండో పెళ్లి చేసుకోవడం లేదని స్పష్టం చేశాడు.అయితే చిత్రం సెట్స్ నుంచి లీక్ అయిన పెళ్లి పత్రిక ఈ చిత్రానికి మంచి పబ్లిసిటీని తెచ్చిపెట్టింది.

దీంతో “మళ్ళీ మొదలైంది” చిత్రం పై ఆసక్తి నెలకొంది.మరి చిత్ర యూనిట్ సభ్యులు ఈ పబ్లిసిటీని క్యాష్ చేసుకుని ప్రేక్షకులను ఆకట్టుకుంటారో లేదో చూడాలి.

Telugu Fake Wedding Card, Malli Modalaindi, Malli Modalaindi Movie Got Huge Publicity For Fake Wedding Card, Nina Ganguli, Sumanth Akkineni, Telugu Movie, Tollywood-Movie

అయితే ఈ విషయం ఇలా ఉండగా ఈ మధ్య సుమంత్ అక్కినేని విభిన్న తరహా కథలను ఎంచుకుంటూ హిట్, ఫ్లాఫ్ లతో సంబంధంలేకుండా సినిమాలు చేస్తున్నాడు.ప్రస్తుతం “అనగనగా ఒక రౌడీ” అనే చిత్రంలో కూడా హీరోగా నటిస్తున్నాడు.ఈ చిత్రానికి తెలుగు నూతన దర్శకుడు “మను యజ్ఞ” దర్శకత్వం వహిస్తుండగా ప్రముఖ సినీ నిర్మాత గార్లపాటి రమేష్ నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు.

#MalliModalaindi #Nina Ganguli

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు