మల్లీశ్వరి సినిమాలోని ఈ చిన్న పాపని ఇప్పుడు చూస్తే అవాక్కవుతారు...

సినిమా పరిశ్రమలో అప్పుడప్పుడు కొంత మంది చైల్డ్ ఆర్టిస్టులు హీరో హీరోయిన్లు గా ఎంట్రీ ఇస్తూ బాగానే రాణిస్తుంటారు. కానీ మరికొందరు మాత్రం చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించిన అనంతరం సినిమా పరిశ్రమపై ఆసక్తి లేకపోవడంతో ఇతర రంగాల్లో సెటిల్ అవుతుంటారు.

 Malleswari Movie Child Artist Greeshma Nethrikaa Transmissions, Greeshma Nethri-TeluguStop.com

అయితే తెలుగులో ప్రముఖ సీనియర్ దర్శకుడు కె.విజయ భాస్కర్ దర్శకత్వంలో నటించిన “మల్లీశ్వరి” చిత్రంలో హీరో వెంకటేష్ అన్నయ్య కూతురి పాత్రలో నటించి తెలుగు సినీ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న చైల్డ్ ఆర్టిస్ట్ గ్రీష్మ బోయిని గురించి సినీ ప్రేక్షకులకు కొత్తగా తెలియజేయాల్సిన అవసరం లేదు. అయితే ఈ చిత్రంలో గ్రీష్మ “బార్ అంటే ఇంత పెద్ద గా ఉండాలని క్యూట్ గా చెబుతూ తన క్యూట్ క్యూట్ మాటలతో ప్రేక్షకులను బాగా అలరించింది.

అయితే గత కొద్ది కాలంగా ఈ అమ్మడు తన చదువుల నిమిత్తమై సినిమా పరిశ్రమకు దూరంగా ఉంటోంది.

 కాగా గ్రీష్మ తెలుగులో దాదాపుగా 30 కి పైగా చిత్రాలలో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించింది.ఇందులో ముఖ్యంగా వందేమాతరం శ్రీనివాస్ ముఖ్య పాత్రలో నటించిన “అమ్ములు” చిత్రంలో కీలకపాత్ర పోషించి సినీ విమర్శకుల నుంచి మంచి ప్రశంసలు అందుకుంది.

అంతేగాక ఆ మధ్య కొంచెం ఇష్టం కొంచెం కష్టం, ప్రస్థానం, పంచాక్షరి, ఏమో గుర్రం ఎగరావచ్చు, తదితర చిత్రాలలో కూడా కనిపించింది.గత ఏడాది విడుదలైన ఎన్టీఆర్ బయోగ్రఫీ చిత్రంలో కూడా కనిపించి బాగానే అలరించింది.

అయితే ఇటీవలే ఈ అమ్మడు తన చదువును పూర్తి చేసుకొని సినిమాల్లో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చేందుకు సన్నాహాలు చేస్తోంది.మరి చైల్డ్ ఆర్టిస్ట్ గా బాగానే రాణించిన  గ్రీష్మ హీరోయిన్ గా ఎలా ఆకట్టుకుంటుందో చూడాలి.

అయితే ఈ విషయం ఇలా ఉండగా తెలుగులో “లవ్ యూ బంగారం” అనే చిత్రంలో హీరోయిన్ గా నటించి సినీ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకున్న “శ్రావ్య” గ్రీష్మ సోదరి అని చాలా మందికి తెలియదు.అయితే శ్రావ్య తెలుగులో ఆర్య, అవునన్నా కాదన్నా, కాయ్ రాజా కాయ్, నందిని నర్సింగ్ హోమ్, తదితర చిత్రాలలో హీరోయిన్ గా నటించింది.

 కానీ ఈ చిత్రాలలో ఈ అమ్మడి పాత్రకు పెద్దగా ప్రాధాన్యత లేకపోవడంతో ఎవరూ గుర్తించలేదు.దీంతో ప్రస్తుతం శ్రావ్య ఎలాంటి సినిమా అవకాశాలు లేక ఇంటి పట్టునే ఖాళీగా గడుపుతోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube