పీఏ అనుమానాస్పద మృతి…ఏకంగా కలెక్టర్ పైనే కేసు….  

Malkangiri collector booked for PA\'s Murder case, Collector Manish Agarwal, Devi Narayana panda, Odisha Crime News, Malkangiri collector - Telugu Collector Manish Agarwal, Dev Narayana Panda, Malkangiri Collector, Odisa Crime News

పీఏ అనుమానాస్పద మృతి ఘటన నేపథ్యంలో ఏకంగా ఆ జిల్లా కలెక్టర్ పై పోలీస్ స్టేషన్ లో హత్య కేసు నమోదైంది.ఈ ఘటన ఒడిశా లోని మల్కన్ గిరి జిల్లా లో చోటుచేసుకుంది.

TeluguStop.com - Malkangiri Collector Booked For Pas Murder Case

ఆ జిల్లా కలెక్టర్ మనీష్ అగర్వాల్ దగ్గర పీఏ గా పని చేసిన దేవ్ నారాయణ పండా గత ఏడాది డిసెంబర్ 26 న అనుమానాస్పదంగా మృతి చెందారు.అయితే అతడి మృతి పై పండా భార్య వనజ పంధా అనుమానం ఉందంటూ కోర్టు ను ఆశ్రయించడం తో కోర్టు ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది.

దీనితో కలెక్టర్ పై హత్య కేసు నమోదు చేశారు పోలీసులు.

TeluguStop.com - పీఏ అనుమానాస్పద మృతి…ఏకంగా కలెక్టర్ పైనే కేసు….-General-Telugu-Telugu Tollywood Photo Image

గతేడాది అనుమానాస్పదంగా మృతి చెందిన దేవ్ నారాయణ్ మృతదేహం జిల్లా లోని సతిగుడ జలాశయంలో గుర్తించడం తో అసలు అతడు ఆత్మహత్యకు పాల్పడ్డాడా? లేదంటే హత్యకు గురయ్యాడో అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.అయితే ఆ సమయంలో నారాయణ పండా మృతి ఘటనను అనుమానాస్పద మృతి గా కేసు నమోదు చేసినప్పటికీ ఆ మేరకు ఎలాంటి విచారణ చేపట్టలేదు దీనితో పండా భార్య జిల్లా కోర్టు ను ఆశ్రయించడం తో కోర్టు కలెక్టర్ పై కేసు నమోదు చేయాలనీ ఆదేశాలు జారీ చేసింది.తన భర్త అనుమానాస్పద మృతి పై విచారణ జరపాలని పోలీసులు ఈ మేరకు విచారణ చేపట్టాలి అంటూ ఆమె కోర్టును కోరడం తో సానుకూలంగా స్పందించిన కోర్టు ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది.

దీనితో మల్కన్ గిరి పోలీస్ స్టేషన్ లో సోమవారం కలెక్టర్ మనీష్ ఆగర్వాల్ పై హత్య కేసు నమోదు అయినట్లు తెలుస్తుంది.అంతేకాకుండా కలెక్టర్ గారి సిబ్బంది అయిన మరో ముగ్గురిపై కూడా కేసు నమోదు చేసినట్లు సమాచారం.దీనితో అసలు పండా మృతి వెనుక ఏదైనా కారణం ఉందా, లేదంటే నిజంగానే ఆయన హత్యకు గురయ్యారా అన్న దానిపై పోలీసులు విచారణ చేయనున్నారు.ఈ నేపథ్యంలో ఆ జిల్లా కలెక్టర్ గా ప్రస్తుతం మనీష్ అగర్వాల్ స్థానంలో ఎద్దుల విజయ్ కుమార్ ను ప్రభుత్వం నియమించినట్లు తెలుస్తుంది.

#CollectorManish

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Malkangiri Collector Booked For Pas Murder Case Related Telugu News,Photos/Pics,Images..