మలైక అరోరాను హత్తుకున్న మాజీ భర్త.. నెట్టింట్లో వీడియో వైరల్?

తెలుగు ప్రేక్షకులకు బాలీవుడ్ బ్యూటీ మలైకా అరోరా గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.ఈమె తరచూ ఏదో ఒక విషయంలో వార్తల్లో నిలుస్తూనే ఉంటుంది.

 Malika Ex Husband Arbaaz Khan Hugs Each And Other In Mumbai Airport ,malika Aror-TeluguStop.com

కాగా మలైక అరోరా బాలీవుడ్ బ్యూటీ అయినప్పటికీ తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితమే.తెలుగులో మొదటిసారిగా మహేష్ బాబు అతిధి సినిమాలో ప్రత్యేక సాంగ్ చేసిన మలైకా అరోరా.

ఆ తరువాత పవన్ కళ్యాణ్ నటించిన గబ్బర్ సింగ్ లో కెవ్వు కేక అనే పాటలో చిందులు వేసి భారీగా గుర్తింపు తెచ్చుకుంది.ఇకపోతే మలైక బాలీవుడ్ నటుడు సల్మాన్ సోదరుడు అర్భాజ్ ఖాన్ ను 1998 లో ఆమె వివాహం చేసుకున్న విషయం తెలిసిందే.

అనంతరం మనస్పర్థల కారణంగా 2016 లో విడిపోతున్నామని ప్రకటించిన ఈ జంట 2017లో అధికారికంగా విడాకులు తీసుకున్నారు.వీరికి ఓ కుమారుడు అర్షాన్ ఖాన్.కాగా, విడాకుల తర్వాత మలైక ఆమె తనకంటే 12 ఏళ్ల చిన్నవాడైన బోనీ కపూర్ కుమారుడు అర్జున్ కపూర్ తో రిలేషన్ లో ఉన్న సంగతి తెలిసిందే.

ప్రస్తుతం అర్జున్ కపూర్ తో రిలేషన్ లో ఉంది మలైక.ఇది ఇలా ఉంటే తాజాగా మలైక అరోరా తన మాజీ భర్త అర్బాజ్ ఖాన్ ను కలిసింది.తాజాగా మలైక,అర్బాజ్ కుమారుడు అర్హాన్ ఖాన్ ఉన్నత చదువుల కోసం విదేశాలు వెళుతున్నాడు.

ఈ క్రమంలోనే అతడికి సెండాఫ్ ఇచ్చేందుకు ముంబయి విమానాశ్రయానికి వచ్చారు.

అతనికి సెండాఫ్ ఇచ్చిన అనంతరం బయటకు వచ్చిన ఇద్దరూ ఒకరి నొకరు ఆత్మీయంగా హత్తుకుని ఎవరీ దారిన వారూ వెళ్లిపోయారు.ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.ఇకపోతే అర్జున్ కపూర్,మలైక అరోరా ఏజ్ గ్యాప్ విషయంలో ఇప్పటికే ఎన్నో రకాల వార్తలు వినిపించిన సంగతి తెలిసిందే.

ఆ వార్తలపై మండిపడుతూ మాకు లేని బాధ మీకు ఎందుకు అంటూ ఆమె ఆగ్రహం వ్యక్తం చేసింది.కానీ ఎక్కువగా వీరిద్దరూ వారి ఏజ్ గ్యాప్ విషయంలోనే వార్తలు నిలుస్తూ ఉంటారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube