ఇక వీసా లేకుండా మలేసియా... భారతీయులకి శుభవార్త

ఇండియా నుంచి ఇతర దేశాలకి వెళ్ళాలంటే కచ్చితంగా వీసా, పాస్ పోర్ట్ ఉండాల్సిందే.అయితే ఆసియాలో కొన్ని దేశాలకి ఎలాంటి వీసా లేకుండా వెళ్లిపోవచ్చు.

 Malaysias Welcoming Visa Free Entries For Tourists-TeluguStop.com

మన పక్కదేశాలైన శ్రీలంక, నేపాల్ కి వెళ్ళడానికి ఇండియన్స్ కి ఎలాంటి వీసా అవసరం లేదు.ఓ విధంగా చెప్పాలంటే ఆ రెండు దేశాలు వెళ్ళిన ఇండియాలో ఉన్నట్లే ఉంటుంది.

ఇక ఆ దేశాలలో ఇండియన్స్ చాలా మంది ఉంటారు.ఆ దేశాలతో భారత్ కి మంచి సత్సంబంధాలు ఉన్నాయి.

ఇదిలా ఉంటే ఇప్పుడు మరో దేశం ఇంయన్స్`ఇండియన్స్ కి వీసా సడలింపు ఇచ్చింది.

ఇకపై ఎటువంటి వీసాను తీసుకోకుండానే మలేసియా వెళ్లి రావచ్చు.

ఇంతవరకూ వీసా తీసుకుని మాత్రమే మలేషియాకు వెళ్ళాల్సి వచ్చేది.అయితే ఇప్పుడు ఆ నిబంధనను రద్దు చేస్తున్నట్టు మలేషియా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసినట్లు ప్రకటించింది.

ఈ అవకాశం ఇండియా, చైనా దేశాలకి మాత్రమే కల్పించింది.ఈ దేశాల నుంచి లక్షల సంఖ్యలో టూరిస్ట్ లు మలేసియా వెళ్తున్నారు.

ఈ నేపధ్యంలో వారి సౌలభ్యం కోసం ఈ నిబంధన తీసుకొచ్చినట్లు తెలుస్తుంది.ఈ విషయాన్ని వెల్లడించిన ఏపీ టూర్స్‌ అండ్‌ ట్రావెల్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు విజయ మోహన్‌, ఇకపై ఆన్ లైన్ లో పేరు నమోదు చేసుకుని మలేషియాలో పర్యటించవచ్చని తెలియజేసారు.

నేపాల్, శ్రీలంకకి వెళ్ళినట్లుగానే మలేషియా కూడా వేల్లోచ్చని పేర్కొన్నారు.ఈ మేరకు భారత పౌరులకు సరికొత్త సౌలభ్యాన్ని మలేషియా సర్కారు కల్పించిందని తెలిపారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube