సింగపూర్: మరణశిక్ష నుంచి తప్పించుకున్న భారత సంతతి వ్యక్తి

మాదక ద్రవ్యాల కేసులో నిర్దోషిగా తేలిన ఓ భారత సంతతి వ్యక్తి సింగపూర్‌లో ఉరిశిక్ష నుంచి తప్పించుకున్నాడు.2017లో 19.42 గ్రాముల హెరాయిన్ లావాదేవిల్లో పాల్గొన్నందుకు హైకోర్టు మరణశిక్ష విధించిన ముగ్గురిలో ఒకరు ప్రాగాస్ క్రిసామి.మిగతా ఇద్దరు సింగపూర్‌కు చెందిన ఇమ్రాన్ మహ్మద్ అరిప్, భారతీయ సంతతికే చెందిన మలేషియన్ తమిళ్ సెల్వం యగశ్రవణన్.

 Malaysian Of Indian Origin Escapes Gallows After Acquittal In Drug Trafficking C-TeluguStop.com

సింగపూర్ మిస్‌యూజ్ డ్రగ్స్ యాక్ట్ ప్రకారం.హెరాయిన్ అక్రమ రవాణా 15 గ్రాములకు మించినప్పుడు మరణశిక్ష విధించేందుకు న్యాయస్థానాలకు అధికారం వుంది.ఈ కేసులో అప్పీల్ కోర్టు క్రిసామిని శుక్రవారం నిర్దోషిగా ప్రకటించింది.అలాగే ఇమ్రాన్, తమిళ్ సెల్వంలపై నమోదు చేసిన అభియోగాలను సవరించాలని ఆదేశించింది.2017 ఫిబ్రవరిలో ఈ ముగ్గురు జురాంగ్ వెస్ట్ స్ట్రీట్‌‌లోని ఒక భవనంలో కలుసుకున్నారు.అక్కడ క్రిసామి తమిళ సెల్వంతో బయటకు వెళ్లేముందు ఇమ్రాన్‌కు హెరాయిన్‌ను అందజేశాడు.

ఆ తర్వాత కొద్దిసేపటికే వీరు పోలీసులకు చిక్కారు.

Telugu Drug, Indian Origin, Malaysianindian, Singapore-Telugu NRI

హెరాయిన్ పరిమాణం 15 గ్రాములకు మించి వుండటంతో హైకోర్టు ప్రాగాస్‌కు మరణశిక్షను విధించింది.ఇందుకు మూడు కారణాలను చూపింది.మొదటిది నిషేధిత సిగరెట్ల పంపిణీకి సహకరించినందుకు అతనికి అధికంగా డబ్బు ముట్టడం.

రెండు.వీపుకు తగిలించుకునే బ్యాగ్‌లో రెండు కార్టన్ల సిగరెట్ల బరువుకు మధ్య వ్యత్యాసం వుండటాన్ని గుర్తించకపోవడం.

ఇక చివరి కారణం.ముగ్గురూ పట్టుబడ్డ రోజు (ఫిబ్రవరి 8, 2017)న క్రిసామి, తమిళసెల్వం డెలివరీ చేసే విధానం పూర్తి విరుద్ధంగా వుండటం

అయితే న్యాయస్థానం తీర్పును ముగ్గురూ అప్పీల్ చేశారు.

అప్పీల్ కోర్ట్.హైకోర్టు తీర్పుతో విభేదించింది.

ప్రాగాస్‌ నేరం నిరూపించడంలో ప్రాసిక్యూషన్ విఫలమైందని తెలిపింది.ఫిబ్రవరి 8 నాటి డెలివరీలో తనకు అధికంగా చెల్లించబడుతున్నట్లు క్రిసామికి తెలుసునని చూపించేందుకు తగిన సాక్ష్యాధారాలు లేవని న్యాయస్థానం అభిప్రాయపడింది.

తన బ్యాక్ ప్యాక్ బరువు రెండు కార్టన్‌ల సిగరెట్ల కంటే భిన్నంగా వుందని తాను గమనించలేదని ప్రాగాస్ ఇచ్చిన వివరణను కూడా అప్పీల్ కోర్టు పరిగణనలోనికి తీసుకుంది.బరువులో వ్యత్యాసం 380 గ్రాములేనని న్యాయస్థానం పేర్కొంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube