ఇదేందయ్యా ఇది: కేసు పెట్టిందని భార్య యూట్యూబ్ వంటలన్నీ డిలీట్ చేసిన భర్త..!

భార్య భర్తలు అన్నాక ప్రేమ, చనువు,గొడవలు కామన్.ప్రతి ఒక్కరి సంసారంలో చిన్నచిన్న గొడవలు లేకుండా ఎవరు సంసారాన్ని చేయట్లేదు.

 Malayisa, Youtube Channel, Wife And Huaband-TeluguStop.com

అయితే ఇలాంటి చిన్నచిన్న గొడవలు ఒక్కో సారి పెద్ద గా మారి వేరే దారి తీస్తాయి.సంసార జీవితంలో భార్యాభర్తలు కొద్ది సమయం మాట్లాడుకోకుండా ఉన్నా కానీ ఆ తర్వాత అంతా మామూలే.

కొట్లాడటం అలగడం మాట్లాడడం ఇవన్నీ కామన్.

అయితే తాజాగా ఓ భర్త తన భార్య పై కోపంతో… తన భార్య కు సంబంధించి యూట్యూబ్ లో ఉన్న వీడియో లను డిలీట్ చేశాడు.

ఇకపోతే ఈ సంఘటన మలేషియా దేశంలో జరిగింది.సుగ్గు అనే వ్యక్తి తన భార్య విషితతో కలిసి మలేషియా దేశంలో నివసిస్తున్నాడు.

వారిద్దరూ పనులతో పాటు అదనపు ఆదాయం కోసం యూట్యూబ్ లో ఓ ఛానల్ ను మొదలుపెట్టి అందులో వంటల వీడియోలు అప్ లోడ్ చేసే వారు.

నిజానికి ఈ యూట్యూబ్ ద్వారా వారు బాగానే సంపాదించే వారు.

వీరిద్దరికి సంబంధించిన యూట్యూబ్ చానల్ కు ఏకంగా రెండున్నర లక్షలకు పైగా సబ్ స్కైబర్లు ఉన్నారు అంటే నమ్మండి.ఈ సంవత్సరం జనవరి నెల నుండి ఏకంగా వీరు 98 వీడియోలను అప్ లోడ్ చేశారు.

అయితే తాజాగా వీరిద్దరూ గొడవ పడ్డారు.దీంతో కోపం వచ్చిన భర్త మరుసటి రోజున భార్యపై కొడవలితో దాడి చేయగా ఆమె భర్తపై మలేషియా పోలీసులకు ఫిర్యాదు చేసింది.

ఈ విషయం సంబంధించి పోలీసులు భర్త పై గృహహింస చట్టం కింద కేసు నమోదు చేశారు.ఇక అంతే కోపోద్రిక్తుడైన భర్త వెంటనే వారి యూట్యూబ్ ఛానల్ లో ఉన్న మొత్తం 98 వీడియోలను డిలీట్ చేశాడు.

భర్త చేసిన పనికి నెటిజన్లు చాలా ఫన్నీగా కామెంట్లు చేస్తున్నారు.మీరిద్దరూ గొడవలు పడితే పడండి వంటల వీడియోలు ఎందుకు డిలీట్ చేశారు అని ఫన్నీగా కామెంట్ చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube