మీరా జాస్మిన్ ని ఆ సినీ పరిశ్రమ బ్యాన్ చేసిందా.. ఆమె అంత పెద్ద తప్పు చేసిందా?

సినీ ఇండస్ట్రీకి చెందిన నటీనటులు కొన్ని కొన్ని సమయంలో మితిమీరిన పనులు చేయడం వల్ల ఇండస్ట్రీ నుండి సులువుగా తొలగించబడతారు.కొందరు నటీనటులు స్టార్ హోదాను సంపాదించుకున్నాక వారికి ఎక్కడలేని పొగరు తనం వంటివి వస్తుంటాయి.

 Malayam Movie Industry Bans Meera Jasmine Is She Did Such A Big Mistake-TeluguStop.com

దానివలన అనవసరంగా తమ జీవితాలనే పాడు చేసుకుంటారు.ఇదిలా ఉంటే మరో తెలుగు సినీ నటి కూడా ఆమె చేసుకున్న తప్పుతోనే ఇండస్ట్రీ నుండి బ్యాన్ చేయబడింది.

ఆమె ఎవరో కాదు.తెలుగు సినీ ఇండస్ట్రీలో తెలుగమ్మాయిగా కనిపించి తెలుగు ప్రేక్షకుల హృదయాలను దోచుకున్న నటి మీరా జాస్మిన్.తన నటనతో, అందంతో అందరిని బాగా ఆకట్టుకుంది.ఈమె తెలుగుతో పాటు తమిళ, మలయాళ భాషల్లో కూడా నటించింది.

 Malayam Movie Industry Bans Meera Jasmine Is She Did Such A Big Mistake-మీరా జాస్మిన్ ని ఆ సినీ పరిశ్రమ బ్యాన్ చేసిందా.. ఆమె అంత పెద్ద తప్పు చేసిందా-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అక్కడ కూడా మంచి గుర్తింపు తెచ్చుకుంది.గతంలో సినీ ఇండస్ట్రీకి దూరం కాగా ఈ మధ్య తను మళ్లీ రీ ఎంట్రీ ఇస్తుందని కొన్ని రోజుల నుండి వార్తలు వినిపిస్తున్నాయి.

2001లో సినీ ఇండస్ట్రీకి పరిచయం కాగా అందులో ఆమె నటించిన భద్ర, గుడుంబా శంకర్, గోరింటాకు, అమ్మాయి బాగుంది వంటి సినిమాలు తనకు మంచి గుర్తింపు తెచ్చాయి.వీటితో పాటు ఆమె నటించిన పలు సినిమాలు కూడా ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి.

ఇక ఈమెకు మలయాళ సినిమా నుండి ఉత్తమ నటి అవార్డు కూడా అందింది.అలా పలు సినిమాలలో నటించిన తర్వాత 2014లో దుబాయ్ కి చెందిన సాఫ్ట్ వేర్ ఇంజనీర్ అనిల్ జాన్ టైటస్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుంది.

Telugu Ban, Film Industry, Heroine, Malayalam Industry Bans Meera Jasmine, Meera Jasmine, Meera Jasmine Ban, Meera Jasmine Husband, Meera Jasmine Re Entry, Mollywood Industry, Tollywood-Movie

ఇక పెళ్లి తర్వాత సినిమాలలో నటిస్తానని తెలపగా ఆ తర్వాత మళ్ళీ ఇండస్ట్రీ వైపు అడుగు కూడా పెట్టలేదు.కొంతకాలం తర్వాత తన భర్తకు తనకు కొన్ని విభేదాలు రావడంతో అతని నుండి విడాకులు తీసుకొని దూరంగా ఉంటుంది.ఇక గతంలో మీరా జాస్మిన్ చాలా పుకార్లు ఎదుర్కొంది.అయినా వాటిని పట్టించుకోకుండా తానేంటో తన దారి ఏంటో మాత్రమే చూసుకుంది.

ఇక తను మంచి హోదాలో ఉన్న సమయంలో ఆమె చేసిన తప్పుకు ఓ సినీ పరిశ్రమ ఆమెను బ్యాన్ చేసింది.ఇంతకీ అసలేం జరిగిందంటే.

ఆమె మంచి స్టార్ హోదాలో ఉన్న సమయంలో మలయాళం ఇండస్ట్రీలో అక్కడున్న దర్శక నిర్మాతలతో పొగరుగా మాట్లాడిందని, వ్యతిరేకంగా నడుచుకుందని, ప్రతి ఒక్క విషయాన్ని ఎదిరించి మాట్లాడింది అని అప్పుడు సోషల్ మీడియాలో బాగా వార్తలు వినిపించాయి.దీంతో ఆమెను మలయాళ సినీ పరిశ్రమ బ్యాన్ చేసింది.

Telugu Ban, Film Industry, Heroine, Malayalam Industry Bans Meera Jasmine, Meera Jasmine, Meera Jasmine Ban, Meera Jasmine Husband, Meera Jasmine Re Entry, Mollywood Industry, Tollywood-Movie

ఇక ఈ విషయం అప్పట్లో బాగా హాట్ టాపిక్ గా మారగా.అందుకే తాను మలయాళంలో అవకాశాలు అందుకోలేకపోయిందని తెలిసింది.ఇక ప్రస్తుతం కొన్ని రోజుల నుండి సోషల్ మీడియాలో ఆమె రీ ఎంట్రీ ఇస్తుందని వార్తలు వినిపించాయి.ఒకప్పుడు బొద్దుగా ఉండే మీరాజాస్మిన్ ఈమధ్య బాగా వర్క్ అవుట్ లు చేస్తూ బాగా సన్నబడింది.

దీంతో మంచి ఫిజిక్ సొంతం చేసుకున్న ఈమె సినిమాలలో నటిస్తుందేమో అని తన అభిమానులు అనుకున్నారు.ఈమె రీ ఎంట్రీ ఉంటే మాత్రం తెలుగు ప్రేక్షకులు ఈమెను పక్కా ఆదరిస్తారు.

#Meera Jasmine #Meera Jasmine #Meera Jasmine #Meera Jasmine #Mollywood

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు