బర్త్ డే స్పెషల్: ఆన్ స్క్రీన్ మీద 'ది కంప్లీట్ మ్యాన్' మోహన్​లాల్..!

సౌత్ సినిమా ఇండస్ట్రీ లోనే కాకుండా భారత దేశ చలనచిత్ర పరిశ్రమలో తనకంటూ ఓ ప్రత్యేకమైన పేరును సంపాదించుకున్న వ్యక్తి మోహన్ లాల్.‘ది కంప్లైంట్ మ్యాన్’ అని పిలిపించుకునే వ్యక్తిగా ఆయన ఎన్నో పాత్రలలో జీవించి ప్రేక్షకులను మైమరిపించారు.నేడు ఆయన 61వ పుట్టిన రోజును జరుపుకుంటున్నారు.ఈ సందర్భంగా మలయాళ సూపర్ స్టార్ గా పేరుపొందిన మోహన్ లాల్ గురించి మరి కొన్ని ఆసక్తికర విషయాలను మనం తెలుసుకుందాం.

 The Complete Man Mohan Lal Birthday Special , Mohan Lal, Malayalam, Sandalwood,-TeluguStop.com

హీరో మోహన్ లాల్ అసలు పేరు మోహన్ లాల్ విశ్వనాధ్ నాయర్.ఈయన కుస్తీ పోటీలలో ఛాంపియన్ గా నిలిచారు.

ఆయన ఆరో తరగతి చదువుతున్న సమయంలోనే నటనలోకి అడుగుపెట్టి తన నటనా ప్రావీణ్యంతో ప్రేక్షకులకు చూపించాడు.ఓ నాటకంలో 90 సంవత్సరాలు ఉన్న వృద్ధుడిగా నటించి సినీ అభిమానులతో పెద్ద ఎత్తున ప్రశంసలను పొందాడు.

ఇక సినిమా మొదటి రోజులలో ఆయన స్నేహితుల బలవంతం మీద ఆడిషన్ కు వెళ్లిన ఆయన ‘మంజిల్‌ విరింజ పూక్కల్‌‘ సినిమాలో విలన్ పాత్రకు ఎంపికయ్యాడు.ఆ తర్వాత వెనుదిరిగి చూడకుండా అంచెలంచెలుగా ఎదిగిన ఆయన.ప్రస్తుతం మలయాళ సినిమా ఇండస్ట్రీని శాసించే స్థాయికి ఎదిగారు.

మలయాళం ఇండస్ట్రీ నుంచి పులి మురుగన్.

అనే సినిమాతో 100 కోట్ల వసూళ్లను కొల్లగొట్టి ఈ ఘనత సాధించిన మొదటి తొలి మళియాల హీరోగా ఆయన నిలిచారు.

Telugu National Awards, Happy Mohanlal, Lucifer, Malayalam, Maliyalam, Mohan Lal

ఆ సినిమా తర్వాత వచ్చిన లూసిఫర్ చిత్రం ఏకంగా 200 కోట్లకు పైగా వసూళ్లను సాధించి పెట్టడంతో భారతదేశ చిత్ర ఇండస్ట్రీలు ఆయన వైపు చూడడం మొదలు పెట్టాయి.ఈ దెబ్బతో ఆయన 100 కోట్ల హీరోగా మారిపోయాడు.కేవలం తన పాత్రకు ప్రాముఖ్యత ఉన్న సినిమాల్లో మాత్రమే కాకుండా అనేక చిత్ర పరిశ్రమలో అగ్ర కథానాయకుల సరసన మల్టీస్టారర్ సినిమాలు చేసేందుకు ముందు వరుసలో ఉంటారు.

కథలో విషయం ఉండాలి కానీ భాషతో సంబంధం లేకుండా ఆయన సినిమాలు తెరకెక్కిస్తారు.

ఇక మోహన్ లాల్ ఇప్పటివరకు మొత్తం ఐదు జాతీయ అవార్డులు గెలుచుకోగా.

అందులో ఉత్తమ నటుడిగా రెండు అవార్డులు, అలాగే స్పెషల్ జ్యూరీ అవార్డు విభాగంలో రెండు అవార్డులను కైవసం చేసుకున్నారు.అంతేకాదు వాస ప్రస్థానం అనే సినిమాకు నిర్మాతగా మారి మరో అవార్డును కూడా జాతీయస్థాయిలో అందుకున్నారు.

ఇవే కాకుండా మొత్తం 17 కేరళ రాష్ట్ర అవార్డులు, అలాగే 11 ఫిలింఫేర్ అవార్డులను తన ఖాతాలో వేసుకున్న గొప్ప వ్యక్తి మోహన్ లాల్.ఈయన సినిమా పరిశ్రమకు చేసిన సేవలకు గాను భారతదేశ ప్రభుత్వం దానిని గుర్తించి ఆయనకు పద్మభూషణ్, పద్మశ్రీ అవార్డులతో ఆయనను సత్కరించింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube