ప్రభాస్‌ గొప్పతనం ప్రపంచానికి చెప్పిన కేరళ మంత్రి.. ప్రతి ఫ్యాన్‌ గర్వించదగ్గ విషయం  

Malayalam Stars Should Learn From Prabhas Kerala Minister Surendran-

కేరళ వరద బాధితులకు సినిమా పరిశ్రమకు చెందిన వారు ఎందరో సాయం చేసేందుకు ముందుకు వచ్చారు.అయితే వారి స్థాయికి తగ్గట్లుగా వారు ఇస్తున్న విరాళం ఉండటం లేదు అంటూ మొదటి నుండి కూడా విమర్శలు వస్తున్నాయి.కోట్లు పారితోషికంగా తీసుకునే హీరోలు కేవలం 10, 20 లక్షల విరాళం ఇవ్వడం ఏంటీ అంటూ కొందరు విమర్శలు చేస్తున్న విషయం తెల్సిందే.తాజాగా కేరళ మంత్రి సురేంద్రన్‌ కూడా ఇదే విషయాన్ని ప్రస్థావించాడు..

Malayalam Stars Should Learn From Prabhas Kerala Minister Surendran--Malayalam Stars Should Learn From Prabhas Kerala Minister Surendran-

మలయాళ సినిమా పరిశ్రమలో ఎంతో మంది 5 కోట్లకు పైగా పారితోషికం అందుకుంటున్నారు.కాని వారిలో ఏ ఒక్కరు కూడా కోటి రూపాయల విరాళంను కేరళకు ప్రకటించలేదు అంటూ సురేంద్రన్‌ ఆగ్రహం వ్యక్తం చేశాడు.

ఇప్పటి వరకు కేరళకు లారెన్స్‌ మాత్రమే కోటి రూపాయల విరాళంను ప్రకటించినట్లుగా అంతా అనుకుంటున్నారు.ఆ తర్వాత స్థానంలో తమిళ హీరో విజయ్‌ మాత్రం 70 లక్షలు విరాళంను ఇచ్చాడు అంటున్నారు.కాని తాజాగా మంత్రి సురేంద్రన్‌ మాట్లాడుతూ తెలుగు హీరో ప్రభాస్‌ కోటి రూపాయల విరాళంను ఇచ్చాడు అంటూ ప్రకటించడం ప్రస్తుతం చర్చనీయాంశం అవుతుంది.ప్రభాస్‌ విరాళం ఇచ్చినట్లుగా అభిమానులకు మరియు అందరికి తొసు.

కాని కోటి రూపాయలు ఇచ్చినట్లుగా మాత్రం ఏ ఒక్కరికి తెలియదు..

ప్రభాస్‌ కోటి విరాళం ఇచ్చి కూడా ఏ ఒక్కరికి తెలియకుండా ఉంచాడని, కొందరు 25 లక్షలు ఇచ్చి పెద్దగా ప్రచారం చేసుకుంటున్నారు అంటూ సోషల్‌ మీడియాలో ప్రభాస్‌ అభిమానులు పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు.ప్రభాస్‌కు మాత్రమే ఇలా సాధ్యం అంటూ ఫ్యాన్స్‌ గర్వంగా చెబుతున్నారు.

మలయాళ సినీ ఇండస్ట్రీలో పెద్దగా మార్కెట్‌ లేని ప్రభాస్‌ కోటి రూపాయల విరాళం ఇచ్చాడు..

ఆయన్ను చూసి అయిన మలయాళ సినీ తారలు నేర్చుకోవాలంటూ మంత్రి సురేంద్రన్‌ అన్నాడు.ఆయన మాటలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.భారీ ఎత్తున సోషల్‌ మీడియాలో ప్రభాస్‌ కోటి విరాళం ఇచ్చినట్లుగా ప్రస్తుతం ప్రచారం జరుగుతుంది.