యూరప్ లో చిక్కుకున్న స్టార్ హీరో  

Malayalam Star Hero Prithviraj Sukumaran Locked Europe - Telugu Corona Effect, Lock Down, Malayalam Star Hero Locked In Europe, Prithviraj Sukumaran, Tollywood

కరోనా వైరస్ కారణంగా దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ ప్రకటించిన సంగతి తెలిసిందే.ఇక ఇతర దేశాలతో సంబంధాలు తెంచుకుంటూ విమాన సర్వీసులని ఇండియన్ గవర్నమెంట్ బంద్ చేసింది.

 Malayalam Star Hero Prithviraj Sukumaran Locked Europe

కొంత మందిని ప్రత్యేక విమానాలు పంపించి ఇండియా తీసుకొచ్చింది.అయిన కూడా కొంత మంది ఇండియన్ ప్రజలు, సెలబ్రిటీలు ఇతర దేశాలలో చిక్కుకున్నారు.

అలా షూటింగ్ కోసం యూరప్ వెళ్లి చిక్కుకున్న వారిలో మలయాళం స్టార్ హీరో పృధ్వీరాజ్ కూడా ఉన్నారు.

యూరప్ లో చిక్కుకున్న స్టార్ హీరో-Movie-Telugu Tollywood Photo Image

లాక్ డౌన్ విధించక ముందే కొన్ని రోజుల క్రితం మలయాళ స్టార్ హీరో పృథ్వీ రాజ్ తోపాటు అతని కొత్త చిత్రం బృందం యూరప్ లోని జోర్డాన్ దేశానికి కొత్త చిత్రం షూటింగ్ కోసం వెళ్లింది.

కరోనాతో బంద్ అవుతుందని తెలియక అక్కడే ఉండిపోయారు.యూరప్ అంతా లాక్ డౌన్ ప్రకటించడంతో యూనిట్ షెడ్యూల్ ను రద్దు చేశారు.భారతదేశానికి తిరిగి రావాలని అనుకుంటే జనతా కర్ఫ్యూ తర్వాత ఏ మాత్రం గ్యాప్ ఇవ్వకుండా లాక్ డౌన్ ప్రకటించారు.దీంతో పృధ్వీ రాజ్ తో పాటు మొత్తం 58 మంది సభ్యుల బృందం జోర్డాన్ లో చిక్కుకున్నట్లు తెలుస్తుంది.

దర్శకుడు బ్లెస్సీ భారత ప్రభుత్వం కేరళ ఫిల్మ్ ఛాంబర్ అసోసియేషన్ కు తమను భారత్ కు తీసుకురావాలని విజ్ఞప్తి చేశారు.మరి దీనిపై వాళ్ళు ఎలా స్పందిస్తారు అనేది చూడాలి.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Malayalam Star Hero Locked In Europe Related Telugu News,Photos/Pics,Images..