మొత్తానికి రెండు నెలల తరువాత ఇంటికి చేరుకున్న ఆ స్టార్ హీరో  

Malayalam Star Hero Prithviraj Prithviraj Back To India - Telugu Coronavirus, Jordan, Lock Down, Malayalam Star Hero Prithviraj, Movie Shootings, Prithviraj Back To India

కరోనా లాక్ డౌన్ తో దేశవ్యాప్తంగా ఎక్కడకి వెళ్లిన వారు అక్కడే ఉండిపోవాల్సి వచ్చిన సంగతి తెలిసిందే.దేశవ్యాప్తంగా

లాక్ డౌన్

విధించడం తో సినిమా షూటింగ్ లు కూడా ఎక్కడికక్కడ నిలిచిపోయాయి,అలానే విమాన రాకపోకలు కూడా ఎక్కడికక్కడ నిలిచిపోవడం తో విదేశాలకు వెళ్లిన వారు అక్కడే చిక్కుకుపోయారు.

 Malayalam Star Hero Prithviraj Prithviraj Back To India

లాక్ డౌన్ కు ముందు ఒక చిత్ర షూటింగ్ నిమిత్తం జోర్దాన్ వెళ్లిన మలయాళం స్టార్ హీరో పృథ్వీరాజ్ కూడా తన చిత్ర యూనితో కలిసి వెళ్లారు.అయితే వారు అక్కడకి వెళ్లిన తరువాత ప్రపంచ వ్యాప్తంగా లాక్ డౌన్ విధించడం తో చిత్ర యూనిట్ తో సహా పృథ్వి రాజ్ కూడా అక్కడే చిక్కుకు పోయారు.

షూటింగ్ కోసం అని వెళ్లిన వారంతా కూడా దేశం కానీ దేశంలో తిండి దొరక్క నానా ఇబ్బందులు కూడా పడినట్లు వార్తలు కూడా వచ్చాయి.అయితే లాక్ డౌన్ పొడిగిస్తూ పోవడం తో వారు తిరిగి స్వదేశానికి వచ్చే పరిస్థితి లేకుండా పోయింది.

మొత్తానికి రెండు నెలల తరువాత ఇంటికి చేరుకున్న ఆ స్టార్ హీరో-Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image

ప్రస్తుతం పృథ్విరాజ్ ఆడు జీవితం అనే సినిమాలో నటిస్తున్నాడు.ఈ సినిమా షూటింగ్ కోసమే 58 మంది చిత్ర యూనిట్ సభ్యులతో పాటు ఆయన కూడా జోర్దాన్ లో చిక్కుకుపోయారు.

దాంతో ఇప్పుడు అప్పుడూ అనుకుంటూ రెండు నెలలు అక్కడే ఉండిపోయారు.ఆ సమయంలో హీరో పృథ్వీరాజ్ తన ట్విట్టర్‌లో పరిస్థితిని కూడా పోస్ట్ చేసాడు.అక్కడ తాము ఎదుర్కొంటోన్న సమస్యలను ప్రభుత్వానికి తెలియజేశాడు.తమ యూనిట్‌ను ఇండియాకు రప్పించాలని కేరళ సీఎం విజయన్‌తో పాటు ఫిల్మ్ ఛాంబర్‌కు కూడా లేఖ రాసాడు.

ఎట్టకేలకు ప్రభుత్వం స్పందించడంతో పృథ్వీరాజ్ సహా చిత్ర యూనిట్ ప్రత్యేక ఎయిర్ ఇండియా విమానంలో ఇండియా చేరుకున్నారు.దీంతో అభిమానులు, కుటుంబ సభ్యులు తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు.

ప్రస్తుతం ఈ ఫోటోలు, వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు