శాకుంతలం భారమంతా సమంతనే మోయాలా..?

ఒకప్పుడు వరుసగా స్టార్ హీరోల సినిమాల్లో నటించిన సమంతకు నాగచైతన్యతో పెళ్లి తరువాత స్టార్ హీరోల సరసన ఆఫర్లు తగ్గాయి.ఆఫర్లు తగ్గిన నేపథ్యంలో సమంత సైతం లేడీ ఓరియెంటెడ్ సినిమాలలో, అభినయానికి ప్రాధాన్యత ఉన్న పాత్రల్లో ఎక్కువగా నటిస్తున్నారు.

 Malayalam Star Devi Mohan To Pair Up With Samantha-TeluguStop.com

సినిమాల్లో గ్లామర్ పాత్రలకు పూర్తిగా దూరమైన సమంత ప్రస్తుతం శాకుంతలం అనే సినిమాలో నటిస్తున్నారు.గుణశేఖర్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తుండగా ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

త్వరలోనే శాకుంతలం సినిమా షూటింగ్ కు సంబంధించిన పనులు ప్రారంభం కానున్నాయి.ఈ సినిమాలో దుశ్యంతుడి పాత్ర కోసం చాలామంది హీరోల పేర్లు వినిపించగా చివరకు మలయాళ నటుడు దేవ్ మోహన్ ను ఎంచుకున్నారని ప్రచారం జరుగుతోంది.

 Malayalam Star Devi Mohan To Pair Up With Samantha-శాకుంతలం భారమంతా సమంతనే మోయాలా..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

దేవ్ మోహన్ తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం లేని నటుడు కావడంతో పాటు మలయాళంలో కూడా అతనికి తగిన స్థాయిలో గుర్తింపు లేదు.

దేవ్ మోహన్ ఈ సినిమాలో నటించినా ఈ సినిమా బిజినెస్ కు ప్లస్ కాలేడని శాకుంతలం భారమంతా సమంతపైనే పడుతుందని ఫ్యాన్స్ నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.సమంత ఈ తరహా పాత్రల్లో నటించడం ఇదే తొలిసారి.సమంత నటించిన లేడీ ఓరియెంటెడ్ సినిమాలు సైతం భారీగా కలెక్షన్లను రాబట్టలేదు.టాలీవుడ్ హీరోలనే ఈ సినిమాలో తీసుకొని ఉంటే బాగుంటుందని సమంత ఫ్యాన్స్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

మరి ఫ్యాన్స్ అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని దుశ్యంతుడి పాత్ర విషయంలో మార్పులు చేస్తారేమో చూడాల్సి ఉంది.మణిశర్మ ఈ సినిమాకు సంగీతం అందిస్తుండగా గుణశేఖర్ స్వీయ నిర్మాణంలో ఈ సినిమా తెరకెక్కనుందని సమాచారం.

ఈ ఏడాది సెకండాఫ్ లో ఈ సినిమా విడుదలయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది.రుద్రమదేవి తర్వాత గుణశేఖర్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న సినిమా ఇదే కావడం గమనార్హం.

#Pair Up #Samantha #Devi Mohan

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు