ఎవరైనా మంచి హోదాలో ఉన్నప్పటికీ వాళ్లకు కొందరి నుండి వాదనలు ఎక్కువగా ఉంటాయి.అంతేకాకుండా వారంటే పడకపోతే వారిపై దాడులు కూడా జరుగుతుంటాయి.
ఇప్పటివరకు సినీ ఇండస్ట్రీకి, రాజకీయ నాయకులకు, పెద్ద పెద్ద వాళ్లకు జరుగుతూనే ఉన్నాయి.ఇదిలా ఉంటే తాజాగా ఓ మ్యూజిక్ డైరెక్టర్ పై కూడా కత్తులతో దాడి జరిగింది.
ఇంతకీ ఆ మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు.అతడిపై దాడి ఎందుకు జరిగింది అని ఇండస్ట్రీలో తెగ ప్రశ్నలు వేస్తున్నారు.
ఇంతకీ ఆ మ్యూజిక్ డైరెక్టర్ ఎవరంటే.
మాలీవుడ్ కి చెందిన మ్యూజిక్ డైరెక్టర్ జైసన్ జై నాయర్.
ఈయన 2006లో ఇండస్ట్రీకి పరిచయం కాగా దాదాపు 22 సినిమాలలో తన సంగీతాన్ని వినిపించాడు.ఇక ఈయనకు ఈ దాడి జరుగగా.
ఈ విషయం గురించి కేరళ పోలీసులు మీడియాతో తెలిపారు.అతను సోమవారం సాయంత్రం తన కారులో తన నివాసం ఉండే ప్రాంతం ఎటుమనూర్ కు చెర్తాలా నుంచి బయలు దేరగా తనకు ఫోన్ రావడంతో పంట పొలాలతో కూడిన నిర్మానుష్యమైన ప్రాంతంలో తన కారులో ఆపాడు.

ఇక ఆ సమయంలో ముగ్గురు వ్యక్తులు అతని కారుని అడ్డుకొని.ఇక్కడ ప్రమాదాలు జరిగే ప్రాంతమని.అందుకు ముందుకు వెళ్లి కారుని ఆపమని చెప్పే సరికి.ఆయన తన కారుని తీసుకొని ఇంటికి వెళ్తుండగా ఆ ముగ్గురు వ్యక్తులు ఆయన కారుని వెంబడించి బెదిరించారు.
ఆయన దగ్గర ఉన్న విలువైన వస్తువులను ఇవ్వమని కత్తితో బెదిరించారు.దాంతో ఆయన తప్పించుకుందామనే సరికి ఆయన మెడపై చిన్న గాయమైంది.

దాంతో వారి నుంచి ఎలాగోలా తప్పించుకున్నాడని పోలీసులు తెలిపారు.ఇక ఆయన కూడా తన సోషల్ మీడియా వేదికగా ఈ విషయాన్ని పంచుకున్నాడు.కానీ ఈ విషయాన్ని పోలీసులకు ఫిర్యాదు చేయకపోవడం పై సోషల్ మీడియాలో ఈ ప్రమాదం గురించి బాగా చర్చలు జరుగుతున్నాయి.ఇక ఇదంతా దారి దోపిడీ చేసే వాళ్ళ పని నా లేదా ఆయనంటే పడని వ్యక్తులు ఎవరైనా ఇలా చేయించారా అని అనుమానాలు వస్తున్నాయి.
ఇక ఈ విషయం గురించి కూడా జైసన్ స్పందించకపోయేసరికి పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.