అదేదో సినిమాలో నితిన్ చెప్పినట్టు క్రికెట్ లో ఇండియా గెలిస్తే పాకిస్తాన్ తోనే ఆడి గెలవాలి… బంగ్లాదేశ్ తో గెలిస్తే ఏమవుతుంది బొంగు.అచ్చు ఇలాగే ఉంది ప్రస్తుతం టాలీవుడ్( Tollywood ) సినిమా ఇండస్ట్రీ పరిస్థితి.
పాన్ ఇండియా కల్చర్ వచ్చిన తర్వాత టాలీవుడ్ నెంబర్ వన్ స్థానాన్ని కైవసం చేసుకుంది.బాహుబలి సమయం నుంచి ఇప్పటి వరకు బాగానే ముందుకు వెళుతుంది.
అయితే బాలీవుడ్( Bollywood ) కూడా మన తర్వాత లిస్ట్ లో స్థానాన్ని సంపాదించుకోగా కన్నడ ఇండస్ట్రీ కూడా పర్వాలేదనిపిస్తుంది.
ఏది ఏమైనా అందరి కన్నా ముందు మాత్రం మనవారే.
అందులో డౌట్ లేదు.ఒకవేళ రెండో స్థానం లో హిందీ ఉండే అవకాశం ఉంది.
కానీ ప్రస్తుతం మరొక సవాల్ తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఎదురవుతోంది.అదే కేరళ సినిమా ఇండస్ట్రీ.
మలయాళ సినిమాలు( Malayalam Movies ) అనగానే మనకు ఎక్కువగా మన చిత్రాలు మలయాళ కథల ఆధారంగానే తీస్తారు అనే విషయం క్లారిటీ ఉంది, ఎందుకంటే తెలుగులో చాలా చిత్రాలు కూడా మలయాళం లో ఒకప్పుడు వచ్చినవి.

అందుకే మలయాళ సినిమా ఇండస్ట్రీపై తెలుగు చాలానే ఆధారపడుతుంది.కానీ మలయాళం లో వారికి వారుగా స్వతహాగా ప్యాన్ ఇండియా సినిమాలు( Pan India Movies ) ఇప్పటి వరకు తీయలేదు.అయితే సంక్రాంతి సీజన్ తర్వాత మలయాళ సినిమా ఇండస్ట్రీ కూడా 100 కోట్ల పైగా బడ్జెట్ వసూలు చేస్తున్న చిత్రాలను విడుదల చేస్తుంది.
దాంతో మన తెలుగు సినిమా హావా కాస్త డ్రై అయిపోయింది.ఇప్పటికే ఫిబ్రవరి మొత్తం ఒక్క సినిమా కూడా ఆకట్టుకోకపోవడంతో అందరూ మలయాళ సినిమాలనే చూస్తున్నారు.

మనతో బాలీవుడ్ సినిమా ఇండస్ట్రియే పోటీ తట్టుకోలేక రేసు నుంచి అవుట్ అవ్వగా 2024లో కేరళ ఇండస్ట్రీ మాత్రం వరుస బ్లాక్ బాస్టర్ చిత్రాలను తీస్తూ మంచి జోరు మీద ఉంది.ఇప్పటికే మమ్ముట్టి( Mammootty ) భ్రమయుగం( Bramayugam ) 100 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించింది.అది మాత్రమే కాదు ప్రేమలు( Premalu ) మంజుమెల్ బాయ్స్( Manjummel Boys ) వంటి చిత్రాలు కూడా 100 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధిస్తున్నాయి.అతి చిన్న చిత్ర పరిశ్రమ అయిన మలయాళంలో కథలు బాగుంటాయి.
కానీ ఇలా వందల కోట్ల కలెక్షన్స్ అనేది టాలీవుడ్ కి కొరకరాన్ని కొయ్యలా మారే అవకాశం ఉంది.