ఫోటోటాక్ : వావ్‌ భావన సూపర్‌.. న్యూ ఎంట్రీకి సిద్దమైందా?

తెలుగు లో ఒంటరి, మహాత్మ వంటి సూపర్ హిట్ సినిమా లలో నటించి మెప్పించిన భావన ఇప్పుడు సినిమా లకు కాస్త దూరంగా ఉంటూ వస్తోంది.ఆ మధ్య పెళ్లి పీటలు ఎక్కిన భావన సినిమా లకు దూరంగా ఉండటం తో ఆమె అభిమానులు కాస్త నిరుత్సాహంగా ఉన్నారు.

 Malayalam Heroine Bhavana Saree Photos Goes Viral ,bhavana, Heroine Bhavana, Bha-TeluguStop.com

ఆమె పై వివిధ రకాలుగా ప్రచారం జరగడం తో పాటు కొందరు ఆమెపై దాడికి కూడా పాల్పడ్డారనే పుకార్లు షికార్లు చేశాయి.ఆ విషయంలో ఎంత వరకు నిజం ఉంది అనే విషయం తెలియదు, కానీ భావన విషయంలో ఆమె అభిమానులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.

ఆమె సినిమాల్లోకి మళ్లీ రావాలని ఆమె అభిమానులు ఎంతో కోరుకుంటున్నారు.తాజాగా ఆమె సోషల్ మీడియాలో రెగ్యులర్ గా ఫోటో లను వీడియో లను షేర్ చేస్తుండటం తో అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి సుదీర్ఘ కాలం అవుతున్నా కూడా ఇంకా అందంగా చాలా పద్ధతిగా భావన కనిపిస్తున్నారని అందుకే ఆమె మళ్లీ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇవ్వాలని కోరుకుంటున్నాను అని ప్రతి ఒక్కరూ సోషల్ మీడియా ద్వారా కామెంట్ చేస్తున్నారు.

Telugu Bhavana, Mahatma Bhavana, Ontai-Movie

అభిమానులు కోరుకుంటున్నట్లుగానే భావన మళ్ళీ సినిమా ఇండస్ట్రీలో అడుగు పెట్టేందుకు సిద్ధమైంది.ఈ ఏడాది ఆమె నటించిన రెండు సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలున్నాయి.భారీ అంచనాల నడుమ రూపొందుతున్న ఈ సినిమా కు సంబంధించిన అధికారిక ప్రకటన ఒకటి రెండు రోజుల్లో వెలువడే అవకాశం ఉంది.

ఈ సందర్భం లో భావన ఇలా కేరళ ట్రెడిషన్ చీరకట్టులో కనిపించి అందరినీ ఆకట్టుకుంది ఇంత అందంగా ఉన్న భావనను తెలుగు ప్రేక్షకులు మరియు తెలుగు ఫిలిం మేకర్ ఎలా మిస్ అవుతున్నారు అంటూ నెటిజెన్స్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.ముందు ముందు మళ్ళీ ఈమె తెలుగు ప్రేక్షకుల ముందుకు రావాలని వరుస హిట్లతో దూసుకుపోవాలని కోరుకుంటున్నాం అంటూ కామెంట్ చేస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube