ప్రముఖ బిజినెస్ మెన్ ని పెళ్లి చేసుకున్న బిగ్ బాస్ బ్యూటీ...

సినిమాల పరంగా, సీరియళ్ల పరంగా పెద్దగా గుర్తింపు తెచ్చుకోలేక పోయిన కొందరు నటీనటులు బిగ్ బాస్ షోలో పాల్గొని ప్రేక్షకులకు మరింత చేరువయ్యారు.దీంతో తమలో ఉన్నటువంటి నటనా ప్రతిభను నిరూపించుకుని ప్రస్తుతం వరుస సినిమా అవకాశాలు దక్కించుకుంటూ దూసుకుపోతున్న నటీనటులు కూడా చాలా మందే సినిమా ఇండస్ట్రీలో ఉన్నారు.

 Malayalam Big Boss Beauty Alina Padikkal Marriage With Young Businessman, Malaya-TeluguStop.com

కాగా మలయాళ చిత్ర పరిశ్రమలో పలు ప్రాధాన్యత ఉన్నటువంటి పాత్రలలో నటించి ప్రేక్షకులను బాగానే ఆకట్టుకున్న ప్రముఖ మలయాళ నటి “అలీన పడిక్కల్” గురించి ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.

కాగా అలీన పడిక్కల్ మలయాళ ప్రముఖ రియాల్టీ గేమ్ షో బిగ్ బాస్ 2వ సీజన్ లో కంటెస్టెంట్ గా పాల్గొని ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది.

కాగా ఈ ఏడాది జనవరి మాసంలో కేరళకు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త ని పెళ్లి చేసుకోవాలని నిశ్చితార్థం కూడా చేసుకుంది.కాగా ఇటీవలే అలీన పడిక్కల్ వివాహాన్ని కుటుంబ సభ్యులు చాలా ఘనంగా నిర్వహించారు.

అయితే ఆ మధ్య అలీన పడిక్కల్ తన భర్త రోహిత్ గురించి స్పందిస్తూ రోహిత్ ఇంజనీరింగ్ చదువు పూర్తి చేశాడని దాంతో ప్రస్తుతం తన చదువు కి సంబంధించిన వ్యాపార రంగంలో బాగానే రాణిస్తున్నాడని తెలిపింది.అయితే తాము గత ఆరు సంవత్సరాలుగా ప్రేమించుకుంటున్నామని దీంతో ఇటీవలే వీరిద్దరి పెళ్ళికి కుటుంబ సభ్యుల నుంచి అంగీకారం లభించడంతో పెళ్లి చేసుకున్నట్లు చెప్పుకొచ్చింది.

అంతేకాకుండా వ్యక్తిగతంగా తమ ఇద్దరి మతాలు వేరే అయినప్పటికీ ప్రేమ అనే అభిమతం ద్వారా ఒక్కటైనట్లు తెలిపింది.

Telugu Alina Padikkal, Big Boss, Inter, Malayalambig, Rohith Nair-Movie

ఈ విషయం ఇలా ఉండగా నటి అలీన పడిక్కల్ మలయాళం భాషల్లో పలు చిత్రాల్లో ప్రాధాన్యత ఉన్నటువంటి త్రపాలలో నటించింది.అంతేకాకుండా బుల్లితెరలో కూడా యాంకరింగ్ నిర్వహించి పలు షోలలో, ఈవెంట్లలో బాగానే ఆకట్టుకుంది.కాగా ఇటీవలే ప్రముఖ వ్యాపారవేత్త రోహిత్ తో వివాహం జరగడంతో పలువురు నెటిజన్లు మరియు అభిమానులు సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube