14 మంది తనని వేధించారు... సంచలన విషయాలు బయటపెట్టిన నటి

కాస్టింగ్ కౌచ్ వ్యవహారం ఇండస్ట్రీలో ఎంతో కాలంగా నడుస్తుంది.క్యారెక్టర్ ఆర్టిస్ట్ ల నుంచి హీరోయిన్స్ వరకు చాలా మంది గతంలో తమకు ఎదురైనా వేధింపుల గురించి బయట పెట్టారు.

 Malayalam Actress Revathi Has Exposed The Physical Harassment-TeluguStop.com

హాలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకు ఇండస్ట్రీలో ఎలాంటి వేధింపులకి గురైంది చాలా మంది మీడియాతో పంచుకున్నారు.మీటూ పేరుతో ఈ ఉద్యమం పెద్ద స్థాయిలోనే జరిగింది.

ఇలా హీరోయిన్, ఇతర నటీమణులు, అలాగే సింగర్స్ కూడా తమని వేధించిన వారి పేర్లు కూడా కొంత మంది బయట పెట్టారు.అలా బయట పడ్డవారిలో ప్రముఖ నిర్మాతలు, దర్శకులు, రచయితలు కూడా ఉన్నారు.

 Malayalam Actress Revathi Has Exposed The Physical Harassment-14 మంది తనని వేధించారు… సంచలన విషయాలు బయటపెట్టిన నటి-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఇక టాలీవుడ్ లో శ్రీరెడ్డి తాను ఎలాంటి వేధింపులకి గురైంది చెప్పి కొంత మంది ప్రముఖుల పేర్లు కూడా చెప్పింది.అయితే తరువాత ఆమె ఉద్యమం కంప్లీట్ గా దారితప్పింది.

ఇదిలా ఉంటే తాజాగా మలయాళీ ఇండస్ట్రీలో ఓ నటి తనని వేధించిన వారి వివరాలని పేర్లతో సహా బయట పెట్టి సంచలన ఆరోపణలు చేసింది.

Telugu Malayalam Actress Revathi, Metoo, Physical Harassment, Rajesh Touchriver, South Cinema, Tollywood-Movie

ఇక బయటపెట్టిన వారిలో నటుడు సిద్దిక్ తో పాటు సామాజిక సందేశాత్మక చిత్రాలు తీసే రాజేష్ టచ్ రివర్ కూడా ఉండటం విశేషం.ఇక రాజేష్ టచ్ రివర్ భార్య సునీత మహిళలపై జరుగుతున్న వేధింపులు, వారి హక్కుల కోసం పోరాడే కార్యకర్త కూడా కావడం విశేషం.అతను కూడా సమాజంలో మహిళల వేధింపులపై ఎక్కువగా సినిమాలు తీశారు.

అలాంటి వ్యక్తి తనని వేధించాడని నటి రేవతి పేస్ బుక్ ద్వారా పేర్లు విడుదల చేసింది.తనని వేధించిన వారిలో పోలీస్ నుంచి ఇలా నటులు, దర్శకుల వరకు ఉన్నారని పేర్కొంది.

ఇదిలా ఉంటే ఆమె ఆరోపణలని దర్శకుడు రాజేష్ టచ్ రివర్ ఖండించారు.ఆమె నాపై అసత్య ఆరోపణలు చేస్తుందని, ఎలాంటి ఆధారాలు లేకుండా పేస్ బుక్ పోస్ట్ ద్వారా ఇలా తన పేరు బయటపెట్టి తన పరువు తీసే ప్రయత్నం చేసిందని ఇందులో ఎలాంటి వాస్తవం లేదని పేర్కొన్నారు.

#MeToo

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు