ఈ మల్లు బ్యూటీ అర్జున్ రెడ్డి సినిమాని రిజెక్ట్ చేసింది... ఇప్పుడు ఫీల్ అవుతోంది...

తెలుగులో ప్రముఖ దర్శకుడు సందీప్ రెడ్డి వంగ మరియు ప్రముఖ హీరో రౌడీ విజయ్ దేవరకొండ ల కాంబినేషన్ లో తెరకెక్కిన “అర్జున్ రెడ్డి” చిత్రం బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించిన సంగతి అందరికి తెలిసిందే.అయితే ఈ చిత్రంలో విజయ్ దేవరకొండ కి జోడిగా హీరోయిన్ శాలిని పాండే నటించగా కమల్ కామరాజు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ, సంజయ్ స్వరూప్ తదితరులు ప్రధాన తారాగణంగా నటించారు.

 Malayalam Actress Parvathy Nair Rejected Arjun Reddy Movie Offer-TeluguStop.com

అయితే ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన ఈచిత్రం బాక్సాఫీసు వద్ద దాదాపుగా 100 కోట్ల రూపాయల కలెక్షన్లను సాధించి ఔరా అనిపించింది.అంతేకాకుండా ఈ చిత్రంతో విజయ్ దేవరకొండ సినీ కెరీర్ ఒక్కసారిగా మలుపు తిరిగింది.

దీంతో ప్రస్తుతం విజయ్ దేవరకొండ వరుస చిత్రాల్లో నటించే అవకాశాలను దక్కించుకుంటూ దాదాపుగా 15 కోట్ల రూపాయలకి పైగా రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడు.

 Malayalam Actress Parvathy Nair Rejected Arjun Reddy Movie Offer-ఈ మల్లు బ్యూటీ అర్జున్ రెడ్డి సినిమాని రిజెక్ట్ చేసింది… ఇప్పుడు ఫీల్ అవుతోంది…-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అయితే ఈ చిత్రంలో హీరోయిన్ గా నటించిన “శాలిని పాండే” పాత్రలో ముందుగా మలయాళ సినిమా పరిశ్రమకు చెందిన యంగ్ హీరోయిన్ “పార్వతి నాయర్” ని నటింప చేయాలని చిత్ర యూనిట్ సభ్యులు అనుకున్నారట.

అంతేకాకుండా ఈ విషయమై పార్వతి నాయర్ ని సంప్రదించగా ఆమె ఈ చిత్రంలో బోల్డ్ సన్నివేశాలు మరియు పలు ఎమోషనల్ సన్నివేశాలు ఎక్కువగా ఉండటంతో తాను నటించలేనని రిజెక్ట్ చేసిందట.అయితే అప్పుడు రిజెక్ట్ చేసిన ఈ భామ ఇటీవలే ఓ ప్రముఖ ఇంగ్లీషు ఛానెల్ నిర్వహించిన ఇంటర్వ్యూ లో పాల్గొని ఈ విషయం గురించి స్పందిస్తూ తాను గతంలో అర్జున్ రెడ్డి ఈ చిత్రాన్ని రిజెక్ట్ చేసి చాలా తప్పు చేశానని ఫీల్ అయింది.

దీంతో కొందరు నెటిజనులు ఈ విషయంపై స్పందిస్తూ అవకాశాలు ఒక్కసారి మాత్రమే తలుపుతడతాయని అప్పుడే తలుపు తీసి ఆహ్వానించాలి కానీ వెళ్లిపోయిన తర్వాత తలుపు తీసినా పెద్దగా ప్రయోజనం ఉండదని కామెంట్లు చేస్తున్నారు.

అయితే ఈ చిత్రంలో హీరోయిన్ గా నటించిన శాలిని పాండే కి వచ్చి రావడంతోనే మంచి ఆరంభం లభించినప్పటికీ సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్ గా మాత్రం నిలదొక్కుకోలేక పోయింది.దీంతో ప్రస్తుతం శాలిని పాండే సినిమా అవకాశాలను దక్కించుకోవడం కోసం బాగానే శ్రమిస్తోంది.అంతేకాకుండా ఈ మధ్య ఈ అమ్మడు బాగానే బరువు తగ్గి అందాల ఆరబోతకు సిద్ధమవుతోంది.

#Arjun Reddy #ArjunReddy #Parvathy Nair

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు