టాలీవుడ్ కన్ను మలయాళ సినిమాలపై.. ఇదే ఇప్పుడు ట్రెండ్?

Malayala Movies Remakes In Tollywood Bheemla Nayak God Father Drushyam Details, Malayalam Movie, Tollywood Remakes, Mollywood Movies, Bheemla Nayak Pawan Kalyan, Rana, Chiranjeevi, God Father, Venkatesh, Drushyam, Vishwaksen, Satya Dev, Kappala, Ayyappanum Koshiyum, Lucifer

టాలీవుడ్ పరిశ్రమ రీమేక్ సినిమాలను అడ్డాగా మరి పోయింది.ఇతర భాషల నుంచి సినిమాలను అరువు తెచ్చుకోవడం వాటిని మన తెలుగు హీరోలతో తెరకెక్కించడం బ్లాక్‌బస్టర్ విజయాలను అందుకోవడం దర్శక నిర్మాతలకు కూడా బాగా అలవాటుగా మారిపోయింది.

 Malayala Movies Remakes In Tollywood Bheemla Nayak God Father Drushyam Details,-TeluguStop.com

అయితే కథ రాసుకోవాల్సిన అవసరం లేకపోవడం ఒక ఉన్న కథని మన తెలుగు హీరోల ఇమేజ్‌కి తగ్గట్లుగా కథలో కొన్ని మార్పులు చేస్తే సరిపోతు ఉండడంతో ఇక్కడి దర్శక నిర్మాతలందరూ కూడా రీమేక్ సినిమాలపై ఆసక్తి చూపుతున్నారు.మలయాళంలో హిట్టయిన సినిమాలను ఎక్కువగా రిమేక్ చేస్తూ ఉండడం గమనార్హం.

ఇక లేటెస్ట్ గా పవన్ కళ్యాణ్ రానా కాంబినేషన్ లో తెరకెక్కిన భీమ్లా నాయక్ సినిమా ప్రస్తుతం సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంటూ దూసుకుపోతుంది.ఇది మలయాళం సూపర్ హిట్ మూవీ అయ్యప్పనుమ్ కోషియుమ్ తెలుగు రిమేక్ సినిమా.

పవన్ అన్న చిరంజీవి కూడా మలయాళ సినిమాలు రీమేక్ చేయడానికి రెడీ అయిపోయాడు.మోహన్ లాల్ నటించిన సూపర్ హిట్ పొలిటికల్ ఎంటర్టైనర్ లూసిఫర్ ను గాడ్ ఫాదర్ టైటిల్‌తో రిమేక్ చేస్తున్నారు చిరంజీవి.

Telugu Bheemlanayak, Chiranjeevi, Drushyam, God, Kappala, Lucifer, Malayalam, Mo

ఇక టాలీవుడ్ లో విక్టరీ నే తన పేరుగా మార్చుకున్న వెంకటేష్ మలయాళ సినిమాలు రీమేక్ పైన ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు.ఇప్పటికే మలయాళంలో మోహన్‌లాల్ నటించిన దృశ్యం రెండు పార్ట్ లను కూడా తెలుగులో రీమేక్ చేసి మంచి విజయాన్ని అందుకున్నాడు.

Telugu Bheemlanayak, Chiranjeevi, Drushyam, God, Kappala, Lucifer, Malayalam, Mo

ఇక విశ్వక్సేన్ కి మాస్ కదా అని పేరు తెచ్చిపెట్టింది మలయాళ రీమేక్ సినిమానే కావడం గమనార్హం.మలయాళంలో బాగా హిట్ అయిన అంగమలై డైరీస్ అనే సినిమాని ఫలక్‌నుమా దాస్ అనే టైటిల్‌తో తెరకేక్కించి కెరియర్ ప్రారంభించాడు.మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకున్నాడు.సత్యదేవ్ హీరోగా నటించిన ఉమామహేశ్వర విశ్వరూపం సినిమా కూడా మలయాళంలో మహేశింతే అనే టైటిల్‌తో ప్రేక్షకుల ముందుకి వచ్చింది మంచి విజయం సాధించిన సినిమానే తెలుగులో మంచి హిట్ అయిన మూవీ కేరాఫ్ కంచరపాలం కూడా మలయాళం మంచి తెలుగు రీమేక్ అయింది.

Telugu Bheemlanayak, Chiranjeevi, Drushyam, God, Kappala, Lucifer, Malayalam, Mo

ఇటీవలే మలయాళంలో మంచి విజయం అందుకున్న సినిమాని లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్ బ్యానర్ లలో మంచు మోహన్ బాబు రీమేక్ చేస్తూ ఉండడం గమనార్హం.అంతేకాదు మలయాళంలో సూపర్ హిట్టయిన సినిమా తెలుగు రీమేక్ చేసేందుకు మెగా ఫ్యామిలీ రైట్స్ సొంతం చేసుకుంది అనే టాక్ కూడా ఉంది.ఇక మరోవైపు మలయాళంలో సూపర్ హిట్టయిన కప్పల సినిమాను యువ హీరో సిద్దు జొన్నలగడ్డ తో తెరకెక్కించేందుకు సీతారా ఎంటర్టైన్మెంట్ రైట్స్ సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది.ఇలా తెలుగు లో వచ్చిన సినిమాలన్నీ మలయాళంలో సూపర్ హిట్ అయిన సినిమాలను రీమేక్ కావటం గమనార్హం.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube