నానితో రవితేజ హీరోయిన్ రొమాన్స్..?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో మాస్ మహారాజ్ గా గుర్తింపు తెచ్చుకున్న రవితేజ నటించినటువంటి “నేల టికెట్” సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయమైన నటి మాళవిక శర్మ.ఈమె నటించిన మొదటి సినిమా బాక్సాఫీస్ వద్ద పెద్దగా గుర్తింపు తెచ్చుకోలేదు.

 Malavika Sharma To Romance With Nani-TeluguStop.com

ఈ సినిమా తర్వాత ఆమెకు తెలుగులో ఎలాంటి అవకాశాలు రాలేదు.తాజాగా ఈ ఏడాది ఎనర్జిటిక్ స్టార్ రామ్ హీరోగా తెరకెక్కిన రెడ్ చిత్రంలో హీరోయిన్ పాత్రలో నటించే అవకాశం దక్కించుకున్న ఈ బ్యూటీ ఈ సినిమాతో పరవాలేదనిపించుకుంది.

తాజాగా మాళవిక శర్మ నాచురల్ స్టార్ నానితో జతకట్టబోతున్నట్లు తెలుస్తుంది.ప్రస్తుతం వరుస సినిమాలతో ఎంత బిజీగా ఉన్నా నాని “అంటే.సుందరానికి” చిత్రం తర్వాత.సుకుమార్ శిష్యుడు అయినటువంటి శ్రీకాంత్ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నారు.

 Malavika Sharma To Romance With Nani-నానితో రవితేజ హీరోయిన్ రొమాన్స్..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఈ క్రమంలోనే ఈ సినిమాకు “దసరా” అనే టైటిల్ పరిశీలనలో ఉంచారు.ఇందులో ఇద్దరు కథానాయకులు ఉండబోతున్నారని, వారిలో సెకండ్ హీరోయిన్ గా మాళవిక శర్మ ను తీసుకోవాలనే ఆలోచనలో చిత్రబృందం ఉన్నట్లు సమాచారం.

ఇప్పటికే చిత్ర బృందం ఈమెతో సంప్రదింపులు జరపగా త్వరలోనే మాళవిక శర్మ సినిమా ఎంట్రీ పై క్లారిటీ రానుంది.ఇక త్వరలో దసరా పండుగ సందర్భంగా దసరా పండుగ కానుకగా ఈ సినిమాను అధికారికంగా ప్రకటించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.

మరి దసరా సినిమా ద్వారా మానవిక శర్మ ఏ విధమైనటువంటి విజయాన్ని అందుకుంటుందో తెలియాల్సి ఉంది.

#Nani #Malavika #Ravi Teja

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు