రామ్ మీద నమ్మకం పెట్టుకున్న రవితేజ భామ  

Malavika Sharma Hopes on Ram Red Movie, Tollywood, Telugu Cinema, South Cinema, Kishore Tirumala - Telugu Kishore Tirumala, Malavika Sharma Hopes On Ram Red Movie, South Cinema, Telugu Cinema, Tollywood

చాలా మంది నార్త్ ఇండియా ముద్దుగుమ్మలు స్టార్ హీరోయిన్ గా ఎదగాలని సౌత్ సినిమాలలోకి అడుగుపెడతారు.అలా వచ్చిన వారికి ఆరంభంలో మంచి స్టార్ హీరోలతో సినిమాలు పడతాయి.

 Malavika Sharma Ram Red

అయితే కొంత మందికి ఆరంభంలో చిన్న హీరోలతో సినిమాలు చేసిన తరువాత వరుసగా స్టార్ హీరోలతో జత కట్టే అవకాశం సొంతం చేసుకొని స్టార్ హీరోయిన్స్ అయిపోతారు.అయితే అందరికి ఈ అదృష్టం ఉండదు.

అలాంటి భామలలో మాళవిక శర్మ కూడా ఒకరు.ఈ అమ్మడు నేల టికెట్ సినిమాతో స్టార్ హీరో మాస్ మహారాజ్ రవితేజకి జోడీగా నటించింది.

రామ్ మీద నమ్మకం పెట్టుకున్న రవితేజ భామ-Movie-Telugu Tollywood Photo Image

బయట అందాల ప్రదర్శనలో ఏ మాత్రం హద్దులు పెట్టని ఈ అమ్మడు ఆ సినిమాలో మాత్రం ఒద్దికగా నటించింది.

అయితే సినిమా డిజాస్టర్ కావడంతో తరువాత ఈ భామని ఎవరూ గుర్తించలేదు.

సోషల్ మీడియాలో తన హాట్ ఫోటోషూట్ లతో హడావిడి చేసిన పెద్దగా పట్టించుకోలేదు.అయితే మళ్ళీ అదృష్టం కొద్ది హీరో రామ్ డ్యూయల్ రోల్ చేస్తున్న రెడ్ సినిమాలో అవకాశం దొరికింది.

ఈ సినిమా సక్సెస్ మీద ఆమె కెరియర్ ఆధారపడి ఉంటుంది.కిషోర్ తిరుమల కాబట్టి కొంత పాజిటివ్ టాక్ ఉన్న కూడా ప్రస్తుతం సినిమాని థియేటర్ లో రిలీజ్ చేయలేని పరిస్థితి నెలకొని ఉంది.

ఈ నేపధ్యంలో ఇప్పటికే ఈ సినిమాకి ఓటీటీ నుంచి మంచి ఆఫర్స్ కూడా వస్తుంది.ఏది ఏమైనా మాళవిక శర్మ భవిష్యత్తు మొత్తం రామ్ సినిమా మీదనే ఆధారపడి ఉంది.

మరి ఆమె నమ్మకాన్ని రామ్ ఎంత వరకు నిలబెడతాడు అనేది చూడాలి.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Malavika Sharma Ram Red Related Telugu News,Photos/Pics,Images..