దక్షిణాది ప్రేక్షకుల కోసం అలా మారబోతున్న మాళవిక శర్మ

నేల టికెట్ సినిమాతో హీరోయిన్ గా టాలీవుడ్ లోకి అడుగుపెట్టిన మరో ముంబై ముద్దుగుమ్మ మాళవిక శర్మ.ఈ అమ్మడు మొదటి సినిమాలోనే అందంతో ఆకట్టుకుంది.

 Malavika Sharma Plan To Increase Weight, Tollywood, Telugu Cinema, South Cinema,-TeluguStop.com

క్యారెక్టర్ లో ట్రెడిషనల్ లుక్ లో కనిపిస్తూ పాటలలో హాట్ అందాలతో ప్రేక్షకులని రంజింపజేసింది.అయితే ఆ సినిమా డిజాస్టర్ అవ్వడంతో రెండో సినిమా కోసం చాలా కాలం ఎదురుచూడాల్సి వచ్చింది.

ఈ సారి హీరో రామ్ రెడ్ మూవీతో మరోసారి తెలుగు ప్రేక్షకులని పలకరించబోతుంది.ఈ సినిమా మీద మాళవిక శర్మ చాలా హోప్స్ పెట్టుకుంది.

రెడ్ సినిమా తరువాత తన కెరియర్ టర్న్ తీసుకుంటుందని అవకాశాలు బాగా వస్తాయని ఆశిస్తుంది.ఈ నేపధ్యంలో దక్షిణాది సినిమాలపై మరింత ఎక్కువగా ఈ అమ్మడు శ్రద్ధ చూపించడానికి రెడీ అవుతుంది.

దక్షిణాది ప్రేక్షకులకి కనెక్ట్ అవ్వాలంటే కాస్తా లావుగా ఉండాలని మాళవిక శర్మ భావిస్తుంది.దానికోసం ఒళ్ళు పెంచడానికి కూడా రెడీ అవుతుంది.

Telugu Ram, Malavika Sharma, Red, Telugu, Tollywood-Movie

ఈ విషయాన్ని ఆమెనే స్వయంగా పేర్కొంది.రెడ్ మూవీ ప్రమోషన్ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ ఆసక్తికరమైన విషయాలు పంచుకుంది.ఈ ఏడాది తాను ఫిట్ నెస్ పై ఎక్కువ శ్ర‌ద్ద పెట్టాల‌ని నిర్ణ‌యించుకున్న‌ట్టు చెప్పింది.అంతేకాదు ఓ ఫిట్‌నెస్ ట్రైన‌ర్, డైటీషియ‌న్ ను నియ‌మించుకొని బరువు పెర‌గాల‌ని నిర్ణ‌యించుకున్న‌ట్టు తెలిపింది.

ద‌క్షిణాది ప్రేక్ష‌కులు కాస్త బొద్దుగా ఉండే హీరోయిన్లను ఎక్కువ‌గా ఇష్ట‌ప‌డ‌తార‌ని, వారి కోసం తాను బ‌రువు పెర‌గాల‌నుకుంటున్నాన‌ని తెలిపింది.అలాగే రెడ్ మూవీ తనకి కచ్చితంగా అదృష్టం తీసుకొస్తుందని ఈ అమ్మడు బలంగా నమ్ముతుంది.

మరి సంక్రాంతి కానుకగా రాబోతున్న ఈ సినిమా మాళవిక శర్మకి ఎంత వరకు గుర్తింపు ఇస్తుందో చూడాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube