ప్రకృతితో సహవాసం చేస్తున్న మాలవికా మోహనన్.. లాంగ్ బైక్ రైడ్  

Malavika says she can\'t wait to go for a bike ride, Tollywood, Kollywood, South Heroines, Himalayas, malavika mohanan - Telugu Himalayas, Kollywood, Malavika Mohanan, South Heroines, Tollywood

హిమాలయాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరు అనుకుంటారు.అక్కడి అందాలని ఆశ్వాదించాలని, ఎత్తైన పర్వత శ్రేణుల మధ్య బైక్ పై అలా రైడ్ చేసుకుంటూ వెళ్తే ఆ అనుభూతిని ప్రత్యేకంగా అనుభవించాల్సిన అవసరం లేదు.

TeluguStop.com - Malavika Says She Cant Wait To Go For Bike Ride

అందుకే ఎక్కువ మంది ప్రకృతి ప్రేమికులు సుదీర్ఘమైన హిమాలయాల ప్రయాణం బైక్ ద్వారా చేస్తూ ఉంటారు.అయితే ఇలాంటి ప్రయాణాలు ఆడవాళ్లు కూడా అప్పుడప్పుడు చేస్తూ ఔరా అనిపించుకుంటారు.

తమలోని ధైర్యాన్ని పరిచయం చేస్తూ శభాష్ అనిపించుకుంటారు.అలాంటి కోవలోకే వస్తుంది సౌత్ ఇండియన్ హీరోయిన్ మాలవికా మోహనన్.

TeluguStop.com - ప్రకృతితో సహవాసం చేస్తున్న మాలవికా మోహనన్.. లాంగ్ బైక్ రైడ్-General-Telugu-Telugu Tollywood Photo Image

ఈ మల్లు భామకి బైక్ పై షికార్లు చేయడం అంటే భలే ఇష్టం.ఇంకా బైక్ మీద ఎత్తైన రహదారి అయిన లడఖ్ లో ప్రయాణం చేయడం అంటే ఇంకా ఉత్సాహం చూపిస్తుంది.

బుల్లెట్ మీద అలా ప్రకృతిని ఆశ్వాదిస్తూ సాఫీగా వెళ్ళిపోతూ ఉంటుంది.తాజాగా ఈ అమ్మడు తాను మనాలి-లడఖ్ బోర్డర్ లో బైక్ పైన స్టైల్ గా కూర్చొని ఉన్న ఫోటో షేర్ చేసింది.

దాంతోపాటే తన హిమాలయాల ప్రయాణ అనుభవాలని పంచుకుంది.తనకి ప్రతిసారీ హిమాలయాల్లో బైక్ రైడ్ చేయడం అంటే చాలా ఇష్టమని చెప్పుకొచ్చింది.అప్పుడప్పుడు కార్ లో కూడా ఇక్కడికి వచ్చి వెళుతుంటానని చెప్పింది.ఈ రైడ్ అంటే పడి చస్తానని అంటోంది.

లఢఖ్ అద్భుతమైన ప్రకృతి సౌందర్యంతో అలరారే అరుదైన ప్లేస్.హిమాలయాల్లో మంచు కురియడం ఇప్పుడిప్పుడే తీవ్రతరం అవుతుంటుంది.

నవంబర్ నాటికి ఫుల్ స్వింగులోకి మంచు దుప్పటిలాగా వచ్చేస్తుంది.అక్కడ స్వారీ చేసిన నా అత్యంత ఉత్కంఠభరితమైన క్షణాలను నేను ఆనందించాను అని చెబుతోంది మాళవిక.

గత కొన్ని సంవత్సరాలుగా శక్తివంతమైన హిమాలయాల్ని బైక్ తో అన్వేషించడం చేశానని, నెక్స్ట్ ప్రయాణం కోసం చాలా ఉత్సాహంగా ఎదురుచూస్తున్నా అని చెప్పుకొచ్చింది.

#Kollywood #Himalayas #South Heroines

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Malavika Says She Cant Wait To Go For Bike Ride Related Telugu News,Photos/Pics,Images..